ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో పాప్ స్టార్ రిహాన్నా..
హైదరాబాద్: ఈ ఏడాది ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో కొత్త పాప్ స్టార్ రిహాన్నా చేరింది. 34 ఏళ్ల ఆ సింగర్ వద్ద సుమారు 1.7 బిలియన్ల డాలర్లు విలువైన ఆస్తులు ఉన్నట్లు ఫోర్బ్స్ పేర్కొన్నది. పాప్ సాంగ్స్‌తో ఉర్రూతలూగించే రిహాన్నాకు మ్యూజిక్‌తో పాటు కాస్మిటిక్స్, ఫెంటీ బ్యూటీ, లింగరీ బ్రాండ్ల నుంచి ఆదాయం వస్తోంది. అంబ్రెల్లా, డైమండ్స్, వీ ఫౌండ్ లవ్, వాట్స్ మై నేమ్ ఆల్బమ్‌లు రిహాన్నా కేరీర్లో ఆల్ టైమ్ హిట్స్.
రిహాన్నా పూర్తి పేరు రాబిన్ రిహాన్నా ఫెంటీ. మ్యూజిక్ స్టార్ అయిన ఆమెది బార్బడోస్ దేశం. ఆ దేశం నుంచి ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో చేరిన తొలి వ్యక్తిగా ఆమె నిలిచారు. ర్యాపర్ ఏఎస్ఏపీ రాకీని పెళ్లి చేసుకున్న రిహాన్నా ఇప్పుడు నిండు గర్భిణి. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ఉన్న సెలబ్రిటీల్లో.. రిహాన్నాతో పాటు జే జెడ్, కేన్ వెస్ట్, కిమ్ కర్దాషియన్, ఓఫ్రా విన్ఫ్రే, స్టీవెన్ స్పిల్బర్గ్, పీటర్ జాక్సర్, టైలర్ పెర్రీలు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

