సాయిరామ్‌శంకర్, అశీమానర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రానికి ‘ఒక పథకం ప్రకారం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వినోద్ విజయన్ దర్శకత్వం వహిస్తూ రవి పచ్చముత్తు, గార్లపాటి రమేష్‌లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ విడుదలచేశారు చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. రాముడు, రావణుడి కోణాల్లో భిన్న పార్శాలతో సాయిరామ్‌శంకర్ పాత్రచిత్రణ సాగుతుంది. నటుడిగా అతడిని కొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమిది. ఈ సినిమా కోసం ఆరుగురు జాతీయ అవార్డు గ్రహీతలు పనిచేస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, సినిమాటోగ్రఫీ: రాజీవ్వ్రి, వినోదిల్లంపల్లి, సురేష్రాజన్.