రేణుకా సింగ్ ఇన్‌స్వింగర్ చూడాల్సిందే.. వీడియో
బర్మింగ్‌హామ్: భారత బౌలర్ రేణుకా సింగ్ థాకూర్ తన స్పీడ్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను వణికించింది. కామన్వెల్త్ గేమ్స్ గ్రూపు ఏలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రేణుకా సింగ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. తన ఇన్‌స్వింగర్‌తో ఆస్ట్రేలియా బ్యాట్స్‌వుమెన్ తహలియా మెక్‌గ్రాత్‌ను ఔట్ చేసిన తీరు అందర్నీ స్టన్ చేసింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలో రేణుక షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా టాప్ఆర్డర్ను ఖంగుతినిపించింది. అలిసా హీలే, మెగ్ లానింగ్, బెత్ మూనీ, తాహలియా మెక్‌గ్రాత్‌లను వరుసగా ఔట్ చేసింది. వాస్తవానికి ఇండియాకు గెలుపు ఖాయం అనుకున్నా.. ఆస్ట్రేలియా ప్లేయర్ ఆష్లే గార్డ్నర్ తన దూకుడు బ్యాటింగ్ తో చెలరేగిపోయింది. భారత మహిళల జట్లు అనూహ్య రీతిలో ఓటమి పాలు కావాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో రేణుకా సింగ్ వేసిన బౌలింగ్ తెగ టెన్షన్ పుట్టించింది. మెక్‌గ్రాత్‌ను తన ఇన్‌స్వింగర్‌తో ఔట్ చేసిన తీరు హైలైట్. బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి వెళ్లిన బంతి వికెట్లను కూల్చేస్తుంది. మెక్‌గ్రాత్‌ను అయోమయంలో పడేసిన ఆ బంతి వీడియో ఇదే.
𝗨𝗻𝘀𝘁𝗼𝗽𝗽𝗮𝗯𝗹𝗲! 🔥
Renuka Singh Thakur, everyone. 👏#INDvAUS | #B2022 pic.twitter.com/zfo50r1QLj
— Olympic Khel ™ (@OlympicKhel) July 29, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

