మెడచుట్టూ ముడతలా.. అయితే ఆ సమస్యను వదిలించుకోండిలా..
చర్మ సంరక్షణలో పాలుపంచుకునే ప్రొటీన్లు.. ఎలాస్టిన్, కొలాజెన్ ప్రభావం వయసు పెరిగేకొద్దీ తగ్గుతుంది. దాంతో చర్మం ముడతలు పడుతుంది. ముఖ సౌందర్యం దెబ్బ తింటుంది. అకాల వృద్ధాప్యం వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ సమస్యను వదిలించుకునేందుకు ..
చర్మ సంరక్షణలో పాలుపంచుకునే ప్రొటీన్లు.. ఎలాస్టిన్, కొలాజెన్ ప్రభావం వయసు పెరిగేకొద్దీ తగ్గుతుంది. దాంతో చర్మం ముడతలు పడుతుంది. ముఖ సౌందర్యం దెబ్బ తింటుంది. అకాల వృద్ధాప్యం వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ సమస్యను వదిలించుకునేందుకు ..
ఆలివ్ నూనె
దీనిలో యాంటిఆక్సిడెంట్లు, విటమిన్- ఇ,ఎ పుష్కలం. చర్మానికి కీడు కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి ఇవి కాపాడుతాయి. ఒక టేబుల్‌స్పూన్ ఆలివ్ నూనెను, టేబుల్‌స్పూన్ స్వచ్ఛమైన తేనె, కొన్ని చుక్కల గ్లిజరిన్‌తో కలుపుకొని.. ఈ మిశ్రమంతో మెడమీద మర్దన చేయాలి.
అరటిపండు
అరటిపండ్లలో విటమిన్లు, మినరల్స్, యాంటిఆక్సిడెంట్లు ఎక్కువ. అవి చర్మం పునఃసృష్టిని, కొలాజెన్ ఉత్పత్తిని పెంపొందిస్తాయి. బాగా పండిన అరటిపండును పేస్టుగా చేసుకోవాలి. దానిని ముడతల ప్రాంతంలో సుతారంగా రాయాలి. కాసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి.
బాదం
బాదం గింజలు తిన్నా, ముడతలు పడిన ప్రాంతంలో పేస్టులా రాసుకున్నా మంచి ఫలితాలు ఖాయం. ఫైబర్, ఐరన్, క్యాల్షియం, ఫోలిక్ ఆమ్లం, ఓలెయిక్ ఆమ్లంతో సమృద్ధమైన బాదం గింజలు ముడతలను నివారిస్తాయి.
తేనె
తేనెలోని విటమిన్-బి, పొటాషియం చర్మం సాగే గుణాన్ని మెరుగుపరుస్తాయి. స్వచ్ఛమైన తేనెను ఒక పలుచటి పొరలా మెడ మీద రుద్దుకోవాలి. చర్మం బిగుతుగా మారిందని అనిపించే వరకు అలానే ఉంచుకుని, చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. తర్వాత, మాయిశ్చరైజర్ రుద్దుకోవాలి. వారాని కోసారి ఇలా చేస్తే చాలు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Health
- neck
- remedy
- Skin wrinkles
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

