ENG vs PAK : ఇంగ్లండ్ జట్టులో మరో యువ ఆటగాడు ఆరంగ్రేటం చేశాడు. పాకిస్థాన్‌తో జరగనున్న మూడో టెస్టులో 18 ఏళ్ల రెహాన్ అహ్మద్ ఎంపికయ్యాడు. దాంతో అతను ఇంగ్లండ్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడనున్న అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు సాధించనున్నాడు. ప్రస్తుతం అతని వయసు 18 ఏళ్ల 126 రోజులు మాత్రమే. గతంలోఈ రికార్డు డెన్నిస్ బ్రయాన్ క్లోజ్ పేరిట ఉంది. అతను18 ఏళ్ల 149 రోజుల వయసులో ఇంగ్లండ్ జట్టుకు ఆడాడు. మూడో టెస్టుకు సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్‌కు విశ్రాంతి ఇచ్చారు. అతని ప్లేస్‌లో లెగ్ స్పిన్నర్ అయిన రెహాన్‌ను తీసుకోనున్నారు. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఇతను జట్టులో చోటు సంపాదించాడు. రెహాన్ ఇంతకు ముందు లీసెస్టర్ షైర్ జట్టు తరఫున ఆడాడు. ఇతను ఇంగ్లండ్ జట్టుకు ఆడుతున్న 710వ ఆటగాడు.
బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో పాక్ పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ మొదటి రెండు టెస్టుల్లో విజయం సాధించింది. దాంతో మూడు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది. దాంతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అదరగొట్టిన ఇంగ్లండ్ మూడో టెస్టులోనూ నెగ్గి క్వీన్ స్వీప్ చేయాలనే ఆలోచనతో ఉంది. నామమాత్రమైన మూడో టెస్టు కరాచీలో ప్రారంభం కానుంది.