Detox Water | ఈ డ్రింక్‌తో రోజు ప్రారంభిస్తే మెరుగైన ఆరోగ్యం సొంతం
శరీరానికి అమృతం వంటి మలినాలను తొలగించే డీటాక్స్ వాటర్‌ను (Detox Water) రోజూ ఉదయాన్నే తీసుకుంటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు సొంతమవుతాయి.
న్యూఢిల్లీ : శరీరానికి అమృతం వంటి మలినాలను తొలగించే డీటాక్స్ వాటర్‌ను (Detox Water) రోజూ ఉదయాన్నే తీసుకుంటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు సొంతమవుతాయి. సహజసిద్ధంగా లభించే పదార్ధాలతో కూడిన పోషకాల పవర్‌హౌస్‌గా ఈ డీటాక్స్ వాటర్ రుచిగా ఉండటమే కాకుండా ఇమ్యూనిటీని పెంచడం నుంచి వాపు ప్రక్రియను తగ్గించడం, జీర్ణశక్తి మెరుగుదల వరకూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
చర్మ సమస్యలను, పొట్టలో పేరుకుపోయిన కొవ్వును నివారించడం జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడం వంటి ఎన్నో ప్రయోజనాలను ఈ పానీయంతో దక్కించుకోవచ్చు. బీట్రూట్, అల్లం డీటాక్స్ వాటర్‌తో ఎన్నో ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. పండ్లు, కూరగాయలు, మసాలా దినుసులతో కూడిన ఒక గ్లాస్ వాటర్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. సమ్వాట్చెఫ్ ఇన్స్టాగ్రాం పేజ్‌లో షేర్ చేసిన బీట్రూట్ జింజర్ డీటాక్స్ వాటర్ అద్భుత పానీయంగా ముందుకొచ్చింది.
ఈ డీటాక్స్ వాటర్‌లో వాడే అల్లం జీర్ణక్రియను మెరుగుపరిచి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో పాటు శరీరానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేయడంతో పాటు హృద్రోగాలు, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యాల ముప్పును తగ్గిస్తుంది. ఇక నిమ్మరసంలో రోగనిరోధక వ్యవస్ధను బలోపేతం చేసే విటమిన్ సీతో పాటు కడుపుబ్బరం, వికారాన్ని తగ్గిస్తుంది. ఇక బీట్రూట్ హైబీపీని నియంత్రిస్తూ గుండె ఆరోగ్యానికి మేలుచేస్తుంది. డీటాక్స్ వాటర్‌లో వినియోగించే మిరియాల పొడితో హార్మోన్ల సమతుల్యం చేకూరుతుంది.
Read More :
Vishwa Bharath | ఒకప్పుడు ఊబకాయంతో బాధపడ్డాడు.. ఇప్పుడు సెలబ్రెటీలకే ఫిట్నెస్ ట్రైనర్ అయ్యాడు!!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

