హెచ్‌సీయూ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో రికార్డు
కొండాపూర్, ఏప్రిల్ 22: గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఈ సారి రికార్డుస్థాయిలో క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగాలు చేజికించుకున్నారు. నిరుడు 213 సంస్థల్లో 396 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందగా, ఈ ఏడాది 185 సంస్థల్లో 485 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో అత్యధికంగా రూ.23 లక్షల వార్షిక వేతనంతో ఎంపికవ్వడం విశేషం. ప్లేస్మెంట్ గైడెన్స్ అండ్ అడ్వైజరీ (పీగాబ్) బ్యూరో ఇంచార్జీ ప్రొఫెసర్ సల్మాన్ అబ్దుల్ మోయిజ్ మాట్లాడుతూ.. వర్సిటీ చరిత్రలో ఇదే అత్యుత్తమం అని పేర్కొన్నారు. ప్లేస్మెంట్ ప్రక్రియలో సంస్థలు ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించడంతోపాటు ఇంటర్వ్యూలను జూమ్/గూగుల్ మీట్/టెలిఫోనిక్ ద్వారా నిర్వహించినట్టు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ ప్రేర్ణ అకౌరీ చెప్పారు. టీసీఎస్, డెలాయిట్, ఒరాకిల్, బైజూస్, ఆక్సెంచర్, నోవార్టీస్, నెక్ట్స్ ఎడ్యుకేషన్, క్వాడ్రాటీక్స్, ఫ్లిప్‌కార్ట్, సింక్రోని ఫైనాన్షియల్ తదితర సంస్థల్లో తమ విద్యార్థులు ఉద్యోగాలు పొందినట్టు వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

