రవితేజ కథానాయకుడిగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి ‘రావణాసుర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదలచేశారు. ఈ పోస్టర్లో లాయర్ దుస్తుల్లో రక్తం కారుతున్న సుత్తి పట్టుకొని తీక్షణమైన చూపులతో రవితేజ కనిపిస్తున్నారు. దశావతారాలతో విభిన్నంగా రూపొందించిన ఫస్ట్‌లుక్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ‘హీరోలు ఉండరు’ అనే క్యాప్షన్ చూస్తుంటే రవితేజ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. చిత్రబృందం మాట్లాడుతూ ‘అభినవ రావణాసురుడి కథ ఇది. రవితేజ హీరోనా? విలన్‌గా కనిపిస్తాడా? అన్నది ఉత్కంఠభరితంగా ఉంటుంది. సరికొత్త కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రం కోసం ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నారు’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ: శ్రీకాంత్ విస్సా.