ఎన్టీఆర్ సినిమాపై ఆసక్తికర అప్డేట్..!

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ‘అరవిందసమేత వీరరాఘవ’ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రూపొందుతుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రానికి అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక కథానాయికల విషయానికి వస్తే పూజా హెగ్డే, జాన్వీ కపూర్, కియారా అద్వానీలలో ఒకరిని ఎన్టీఆర్ 30వ సినిమా కోసం ఎంపిక చేయనున్నట్టు ప్రచారం జరిగింది.
తాజా సమాచారం ప్రకారం ఛలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మంథానను కథానాయికగా ఎంపిక చేయనున్నట్టు టాక్. కొన్ని రోజులుగా హిందీ చిత్రం ‘మిషన్ మజ్ను’ తో బిజీగా ఉన్న రష్మిక షూటింగ్ నిమిత్తం లక్నోలో ఉంది. అక్కడి షెడ్యూల్ పూర్తి కాగానే హైదరాబాద్ చేరుకుంది. రీసెంట్గా త్రివిక్రమ్ తో స్టోరీ డిస్కషన్ చేసిన రష్మిక ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపినట్టు సమాచారం. ప్రస్తుతం రష్మిక .. ‘పుష్ప’, శర్వానంద్ ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

