రాశి ఫలాలు 6.2.2022 నుంచి 12.2.2022 వరకు
మేషం
తలపెట్టిన పనులను సంయమనంతో పూర్తిచేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. నూతన ఒప్పందాలు కలిసివస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. పనిలో బరువు, బాధ్యతలు పెరగవచ్చు. అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఖర్చులు పెరిగినా సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు.
వృషభం
వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. నలుగురి సాయం పొందుతారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు సాధిస్తారు. సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం, ఖర్చుల నియంత్రణ అవసరం. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉన్నత విద్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు తోటివారితో సఖ్యత ఏర్పడుతుంది. అయితే పై అధికారులతో భేదాభిప్రాయాలు రావచ్చు. అశ్రద్ధ మూలంగా పనుల్లో జాప్యం జరగవచ్చు. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి.
మిథునం
వివాహాది శుభకార్యాలు చేస్తారు. విందులకు హాజరవుతారు. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. రావలసిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం కావచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆదాయంపై మనసు నిలుపుతారు. స్నేహితులు,ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. నిర్మాణ కార్యక్రమాల మూలంగా ఖర్చులు పెరగవచ్చు.
కర్కాటకం
తలపెట్టిన ప్రయాణాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు మంచి సమయం. రావలసిన సొమ్ము ఆలస్యంగా అందుతుంది. సంయమనంతో పనులు చేస్తారు. విద్యార్థులకు కష్టేఫలి అన్నట్లుగా ఉంటుంది. వృథా ఖర్చులకు, కాలయాపనకు తావు లేకుండా పనులపై శ్రద్ధ నిలపడం మంచిది. భూములు, వాహనాల మూలంగా పనులు నెరవేరుతాయి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి స్పందించండి. వివాదాలకు దూరంగా ఉండి, పనులపై శ్రద్ధ నిలుపుతారు.ఆరోగ్యంగా ఉంటారు. పారిశ్రామికవేత్తలకు అనుకూల వారం. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. భక్తి పెరుగుతుంది.
సింహం
విద్యార్థులకు అనుకూల వారం. మంచి సంస్థలలో అవకాశం రావచ్చు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. రావలసిన డబ్బు సమయానికి అందుతుంది. వ్యాపార విస్తరణ ఆలోచనలు చేస్తారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతి కారణంగా స్థానచలన సూచన. సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. భూముల విషయంలో అనుకూల వాతావరణం ఉంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. రాబడి పెరుగుతుంది.
కన్య
వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహక వాతావరణం. కార్మికుల సహకారం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. న్యాయ పరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఇరుగుపొరుగుతో వివాదాలు తలెత్తవచ్చు. సంయమనంతో పనులు చేస్తారు. భూముల కొనుగోలులో జాగ్రత్త అవసరం. సమస్యలను అధిగమిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు అధికారుల మెప్పు పొందుతారు. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం.
తుల
తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. స్నేహితుల రాకతో ఖర్చులు పెరిగినప్పటికీ, సంతోషంగా గడుస్తుంది. బంధువుల సహకారంతో పనులు నెరవేరుతాయి. ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు పై అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతి, స్థానచలన సూచన. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు అనుకూలిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వృథా ఖర్చులు ఉండవచ్చు. సమయ పాలన అవసరం. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు కాలం అనుకూలిస్తుంది.
వృశ్చికం
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. స్థిరాస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది. వ్యాపారులకు అనుకూల వారం. అనవసరమైన ఆలోచనలతో కొన్ని పనులలో ఆలస్యం జరుగవచ్చు. పెద్దల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులు కార్యక్షేత్రంలో అందరితో స్నేహంగా ఉంటారు. పై అధికారుల మెప్పు పొందుతారు. భూములు, ఆస్తుల విషయంలో వివాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. బంధువులతో కార్యసాఫల్యం ఉంది. సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కోర్టు కేసుల ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.
ధనుస్సు
ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాల వలన కార్యసాఫల్యం ఉంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పాత బాకీలు వసూలు చేయడంలో వివాదాలు తలెత్తవచ్చు. అనాలోచిత నిర్ణయాలతో ఖర్చులు పెరగవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. పెద్దల పలుకుబడితో కొన్ని పనులు పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యవసాయదారుల రాబడి పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. విస్తరణ ప్రయత్నాలు కొన్ని రోజులు వాయిదా వేయండి.
మకరం
ఉద్యోగాన్వేషణకు మంచి సమయం. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. కళాకారులకు అనుకూల వారం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంది. కుటుంబంతో సంతృప్తిగా గడుపుతారు. ఉద్యోగులకు ఆఫీసులో అనుకూల వాతావరణం. అధికారుల అండదండలు లభిస్తాయి. అందరితో స్నేహంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. విహార యాత్రలకు వెళ్లే అవకాశం. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. రోజువారీ వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయ కలిసి వస్తుంది. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం.
కుంభం
ఉత్సాహంగా పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ, పట్టుదల అవసరం. ఉద్యోగులకు ఆఫీసులో పనిభారం పెరగవచ్చు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. వ్యాపారులకు భాగస్వాముల అండదండలు లభిస్తాయి. రావలసిన డబ్బు అందడం ఆలస్యం అవుతుంది. నలుగురిలో పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక పనులపై మనసు నిలుపుతారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కుటుంబ పెద్దల సహకారాన్ని పొందుతారు. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు అనుకూలం. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం.
మీనం
ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారికి ఈ వారం కలిసి వస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యమైన పనులలో ఆలస్యం జరుగుతుంది. మిత్రులను కలుసుకుంటారు. తీర్థయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలనం ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది. రాజకీయంగా పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురి సహకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

