చైనా ల్యాబొరేటరీ నుంచే కరోనా: ఆధారాలున్నాయంటున్న అమెరికా నిపుణులు

న్యూఢిల్లీ: అందరూ అనుకున్నట్లే కరోనా వైరస్ చైనాలోని ల్యాబ్‌లోనే అభివృద్ధి చెందిందా..? చైనాకు ఈ విషయం తెలిసినా దాచిపెట్టిందా? ..ఇద్దరు అమెరికా నిపుణులు వెల్లడించిన కొన్ని విషయాలు ఇవి నిజమనే చెబుతున్నాయి. కొవిడ్-19కు పుట్టినిల్లు చైనా ల్యాబేనని వెల్లడిస్తున్నాయి.
చైనాలోని వూహాన్ నగరంలో 2019 డిసెంబర్లో కరోనా వైరస్ వెలుగు చూసిన విషయం తెలిసిందే. అక్కడినుంచి ప్రపంచమంతా వ్యాపించింది. అయితే, కొవిడ్-19 వైరస్ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచే లీక్ అయిందనే ఆరోపణలు వెలువడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తి చైనా పనేనని అమెరికా మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే, ఇటీవల గుర్తించిన అరుదైన జన్యువులను పరిశీలిస్తే కరోనా వైరస్ చైనాలోని ల్యాబ్‌లోనే అభివృద్ధి చెందిందని తెలుస్తున్నదని ఇద్దరు అమెరికా నిపుణులు అంటున్నారు.
అమెరికన్ నిపుణులు డాక్టర్ స్టీఫెన్ క్వే, రిచర్డ్ ముల్లర్ ప్రకారం కొవిడ్-19 వ్యాధికారక జన్యు ఫుట్‌ప్రింట్ సహజ కరోనా వైరస్‌లో ఎప్పుడూ కనిపించలేదు. దీనిని బట్టి కరోనా వైరస్ కచ్చితంగా ల్యాబ్‌లోనే తయారైనట్లు తెలుస్తున్నదన్నారు. క్వే అమెరికాకు చెందిన బయోఫార్మాస్యూటికల్ కంపెనీ అటోసా థెరప్యూటిక్స్ స్థాపకుడు కాగా, ముల్లర్ కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్.
కొవిడ్ -19 లో సీజీజీ-సీజీజీ (దీనిని “డబుల్ సీజీజీ” అని కూడా పిలుస్తారు) జన్యుక్రమం ఉందని, ఇది 36 సీక్వెన్సింగ్ నమూనాలలో ఒకటి అని క్వే, ముల్లర్ వెల్లడించారు.
సీఓవీ-2తో తిరిగి కలపగల కరోనావైరస్ల తరగతిలో సీజీజీ చాలా అరుదుగా కనిపిస్తుందన్నారు. వాస్తవానికి సీఓవీ-2 ను కలిగి ఉన్న కరోనావైరస్ల మొత్తం తరగతిలో డబుల్ సీజీజీ కలయిక సహజంగా కనుగొనబడలేదన్నారు. అలాగే, ఇక్కడ పునసంయోగానికిగానీ, ఒక వైరస్ నుంచి ఇంకో వైరస్ జన్యుక్రమాన్ని పొందే అవకాశంగానీ లేదన్నారు. అలాగే, సార్స్, మెర్స్ రెండింటికీ సహజ మూలం ఉందని, మానవుల ద్వారా ఈ వైరస్ ఒకరినుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రమాదకరంగా మారుతుందన్నారు. అయితే, కొవిడ్-19 విషయంలో ఆ విధంగా జరుగలేదన్నారు. వైరస్ ప్రమాదకర రూపమే మొదట మనిషిలో కనిపించిందని, అటుతర్వాత వ్యాప్తి ప్రారంభమైందని వెల్లడించారు. దీనినిబట్టి కొవిడ్-19 ల్యాబ్‌లోనే అభివృద్ధి చెందినట్లు తాము నిర్ధారణకు వచ్చామన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

