దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రానా (Rana Daggubati). తాత రామానాయుడు పేరు (రానా) శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లీడర్ (Leader). సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి..తొలి సినిమాతోనే బ్రేక్ అందుకున్నాడు. క్లాస్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్జున్ ప్రసాద్‌గా రానా పోషించిన పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లీడర్ సినిమా నేటికి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. అద్బుతమైన మైల్ స్టోన్‌కు చేరుకున్న సందర్బంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు రానా.
కొత్తదనంతో కూడిన కథలు, పాత్రలను అందించేందుకు ప్రయ 12 ఏళ్ల ప్రయాణం అద్బుతమైంది. మీ విషెస్‌కు ధన్యవాదాలు. అర్జున్ ప్రసాద్ (Arjun Prasad) నుంచి డానియల్ శేఖర్ (Daniel Shekar ). వరకు..ఈ రెండింటి మధ్యలో ప్రతీ పాత్రను ఆదరించి నాలో బతికించినందుకు ధన్యవాదాలు. ప్రతీ సారి కొత్త కథలు, పాత్రలు అందించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా..అంటూ ఇన్ స్టా పోస్టులో సందేశాన్ని పోస్ట్ చేశాడు. డిపార్టుమెంట్, కృష్ణం వందే జగద్గురుమ్, బాహుబలి, రుద్రమదేవి, ది ఘాజీ అటాక్, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలతో సోలో హీరోగా ఉత్తమ నటనను కనబరిచాడు రానా.
పాన్ ఇండియా ప్రాజెక్టు బాహుబలి, బాహుబలి 2లో భళ్లాలదేవుడిగా కండలు తిరిగిన ఫిజిక్ తో థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించాడు రానా. ప్రస్తుతం రానా ఖాతాలో భారీ ప్రాజెక్టులు భీమ్లా నాయక్, విరాటపర్వం ఉన్నాయి. భీమ్లా నాయక్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కాగా..విరాటపర్వంలో హీరోగా నటిస్తున్నాడు.