ప్రస్తుతం ‘పెద్ది’ ప్రమోషన్స్‌తో క్షణం తీరిక లేకుండా ఉన్నారు రామ్‌చరణ్. జూన్ 4న ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సినిమా తర్వాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తారు. ‘పుష్ప’ ఫ్రాంచైజీతో పానిండియా ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు డైరెక్టర్ సుకుమార్. ‘ఆర్ఆర్ఆర్’తో పానిండియా మార్కెట్‌ని గణనీయంగా పెంచుకున్నారు రామ్‌చరణ్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఆ స్థాయి వేరేలా ఉంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సుకుమార్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. ‘పెద్ది’ రిలీజ్ తర్వాత ఓ నెల విశ్రాంతి తీసుకొని సుకుమార్ సెట్లోకి ఎంట్రీ ఇస్తారు రామ్‌చరణ్.
అలాగే, ఆ తర్వాత ప్రాజెక్టులను కూడా ఆయన లైన్లో పెట్టే పనిలో ఉన్నారు. రీసెంట్గా ప్రశాంత్‌నీల్ చె ప్పిన కథను విన్నారట. దాదాపుగా నీల్‌కి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని వినికిడి. అలాగే.. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ కూడా రామ్‌చరణ్‌కి కథ వినిపించారు. ఆ కథపై రామ్‌చరణ్ కూడా ఆసక్తిగా ఉన్నారని టాక్. మొత్తంగా చూస్తే, రామ్‌చరణ్ లైనప్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నది. ఈ లైనప్‌ని బట్టి వచ్చే అయిదేళ్ల వరకూ ఆయన డైరీ ఫుల్.