రక్షణరంగంలో పరిశోధనలకు రూ.499 కోట్లు
రక్షణరంగంలో పరిశోధనలకు రూ.499 కోట్లు | వచ్చే ఐదేళ్ల కాలంలో రక్షణ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం రూ.499 కోట్ల బడ్జెట్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదించారు.

న్యూఢిల్లీ : వచ్చే ఐదేళ్ల కాలంలో రక్షణ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం రూ.499 కోట్ల బడ్జెట్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదించారు. రక్షణ రంగంలో స్వావలంబన లక్ష్యంతో దాదాపు 300 స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), వ్యక్తిగత ఆవిష్కర్తలకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. సైనిక హార్డ్‌వేర్, ఆయుధాల దిగుమతులను తగ్గించి, భారతదేశాన్ని రక్షణ తయారీ కేంద్రంగా మార్చాలన్న ప్రభుత్వ ప్రయత్నంతో ఈ పథకం సమకాలీకరిస్తోందని పేర్కొంది. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్) -డెఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ (డీఓఓ) కు వచ్చే ఐదేళ్లకు రూ.498.8 కోట్ల బడ్జెట్ మద్దతును రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదించినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
రక్షణ, ఏరోస్పేస్ రంగంలో స్వావలంబన.. స్వదేశీకరణ ప్రాథమిక లక్ష్యం ఐడెక్స్-డీఓఓకు ఉందని తెలిపింది. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో ఆవిష్కరణ, సాంకేతిక అభివృద్ధిని పెంపొందించడానికి పర్యావరణ వ్యవస్థను సృష్టించడం లక్ష్యంగా రక్షణ ఉత్పత్తి విభాగం (డీడీపీ) ఐడెక్స్ ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు, డీఓఓను ఏర్పాటు చేయడం మంత్రిత్వ శాఖ తెలిపింది. రాబోయే ఐదేళ్లకు రూ.498.8 కోట్ల బడ్జెట్ సహకారంతో ఈ పథకం, డీఓఓ ఫ్రేమ్‌వర్క్ కింద దాదాపు 300 మంది స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు, వ్యక్తిగత ఆవిష్కర్తలు.. 20 భాగస్వామి ఇంక్యుబేటర్లకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
కొవిడ్-19 నుంచి రక్షణకు ఎస్బీఐ పర్సనల్ ‘కవచ్’
పులిట్జర్ అవార్డును గెలుచుకున్న భారత సంతతి జర్నలిస్టు
కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయి
కరోనా మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాలి : ఎయిమ్స్ డైరెక్టర్
తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన
కరోనా థర్డ్ వేవ్‌లో పిల్లలపై ప్రభావం తక్కువే : అధ్యయనం
దేశంలో దిగివస్తున్న కరోనా.. 24గంటల్లో 80,834 కేసులు
పల్లె, పట్టణ ప్రగతిపై అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BTech Admissions | ఇంజినీరింగ్ చదువుకు తగ్గుతున్న క్రేజ్.. భారీగా తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
Israel Results | ఇజ్రాయెల్‌లో తుది ఫలితాలు వెల్లడి.. ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమేనా..!
SIR Enumeration | తెలంగాణలో ‘సర్’ షెడ్యూల్ పొడిగింపు
రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వివాదంలో కీలక మలుపు.. రేడియల్ రోడ్ల టెండర్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Kodangal |సీఎం ఇలాకాలో బుల్డోజర్ల మోత.. ఆడపిల్లలు ఉంటారన్న సోయి మరిచి బాలికల హాస్టల్‌పై ప్రతాపం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

