మేవాత్ ‘మినీ పాకిస్తాన్’.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
మేవాత్ ‘మినీ పాకిస్తాన్’.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు | రాజస్థాన్ శాసనసభలో బుధవారం బీజేపీ నేత మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మేవాత్ ప్రాంతాన్ని ‘మినీ పాకిస్తాన్’ అంటూ సంబోధించారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. మదన్ దిలావర్ అసెంబ్లీలో మాట్లాడుతూ మేవాత్‌లో హిందువులు భయభ్రాంతులకు గురవుతున్నారని,

జైపూర్ : రాజస్థాన్ శాసనసభలో బుధవారం బీజేపీ నేత మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మేవాత్ ప్రాంతాన్ని ‘మినీ పాకిస్తాన్’ అంటూ సంబోధించారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. మదన్ దిలావర్ అసెంబ్లీలో మాట్లాడుతూ మేవాత్‌లో హిందువులు భయభ్రాంతులకు గురవుతున్నారని, దీంతో ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాల్సి వచ్చిందన్నారు. ‘మేవాత్ ప్రాంతంలో ముప్పు పెరుగుతోంది, అసమర్థ గెహ్లాట్ ప్రభుత్వం కారణంగా మహిళలపై అనేక అత్యాచారాలు, అఘాయిత్యాలు నమోదవుతున్నాయి’ అని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మతమార్పిడులపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దొటసారా స్పందిస్తూ.. ‘మీకు (బీజేపీ) హిందూ ముస్లిం రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసు. దీంతో మీకు ఒక్క ఓటు కూడా రాదు’ అన్నారు. ఇదిలా ఉండగా.. మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో ఉంటారు. రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్‌పై సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్‌ను తాలిబానీ ఆలోచన ఉన్న పార్టీగా అభివర్ణించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

