అభిమానానికి మించిన అర్హత లేదు

‘చిన్నతనం నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగా. గ్యాంగ్‌లీడర్, ఇంద్ర, ఠాగూర్‌తో పాటు ప్రతి సినిమాలో చిరంజీవి పాత్రలో నన్ను నేను ఊహించుకునేవాణ్ని. ఆ అభిమానానికి మించిన అర్హత మరొకటి లేదని ధైర్యం చేసి చిరంజీవి టైటిల్‌ను మా సినిమాకు పెట్టాం’ అని అన్నారు కార్తికేయ గుమ్మకొండ. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి దర్శకుడు. టి. ఆదిరెడ్డి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. తాన్య రవిచంద్రన్ కథానాయిక. ఈ నెల 12న విడుదలకానుంది. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. బిగ్ టికెట్‌ను సుధీర్‌బాబు, శ్రీవిష్ణు, విశ్వక్సేన్ విడుదలచేశారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ “ఆర్ఎక్స్100’ సక్సెస్ తర్వాత నేను విన్న కథ ఇది. నా సినిమా అన్న ఫీలింగ్ మనసులో బలపడింది. అంతగా నన్ను ఆకట్టుకున్నది. నటుడిగా నాపట్ల ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ సినిమాతో హిట్ కొడుతున్నాననే విశ్వాసం బలంగా ఉంది’ అని తెలిపారు. ‘నవ్యమైన ఆలోచనలతో కొత్తతరం సినిమాలు చేస్తున్నారు. ప్రతిభ ఉంటే ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్‌తో పనిలేదని కార్తికేయ, సుధాకర్ లాంటి నటులు నిరూపిస్తున్నారు’ అని దిల్‌రాజు పేర్కొన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఎన్ఐఏ అధికారిగా కార్తికేయ పాత్ర నవ్యరీతిలోఉంటుంది’ అని తెలిపారు. ‘మూడేళ్ల క్రితం ఈ సినిమా మొదలైంది. కార్తికేయతో పాటు ప్రతి ఒక్కరూ తమ సొంత సినిమా అనే భావనతో కష్టపడ్డారు. ఎంటర్టైన్మెంట్, థ్రిల్‌తో పాటు నవ్యానుభూతిని పంచే చిత్రమవుతుంది’ అని దర్శకుడు చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- kartikeya
- Raja Vikramarka
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

