Kedarnath Landslides Collapsed | కుండపోత వర్షాల కారణంగా కేదార్నాథ్ (Kedarnath) పాదయాత్ర మార్గంలో గౌరీకుండ్ (Gaurikund)కు వెళ్లే దారిలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా అధికారులు కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
ప్రస్తుతం శిథిలాలను తొలగించే పనులు అధికారులు చేపట్టారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించి, ప్రయాణ మార్గం సురక్షితమని తెలిపిన తరువాతే యాత్ర ప్రారంభమవుతుంది.
పనులు పూర్తయ్యేవరకు యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి (Disaster Management District Officer) రాజ్వార్ సూచించారు. అనవసర ప్రయాణాలు మానుకొని, పరిపాలన యంత్రాంగం జారీ చేసిన సూచనలను పాటించాలని కోరారు.
రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినందున భక్తులు కేదార్నాథ్ యాత్రను కొన్ని రోజులు వాయిదా వేసుకుంటే మంచిదని తెలిపారు.