సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని క్షణంలో అందుకోవడం తమకూ సాధ్యమేనని నిరూపిస్తున్నారు మహిళామణులు. అందుకు నిదర్శనం ‘ఆల్ ఉమెన్ సూపర్ కార్ క్లబ్ (క్వీన్స్ డ్రైవ్ క్లబ్)’.
దేశంలోనే మొదటిసారిగా గుర్గావ్లో ఈ క్లబ్ ఏర్పడింది. ఢిల్లీకి చెందిన రితికా జతిన్ అహూజ దీనికి సారథ్యం వహిస్తున్నారు. రేసింగ్ కార్లను నడపడం ఆడవారికి చేతకాదనే అపవాదు ఇకనుంచి వినిపించడానికి వీల్లేదని అంటున్నారీ సూపర్ క్వీన్స్. ఈ క్లబ్లో దేశవ్యాప్తంగా సభ్యులున్నారు. అందరి దగ్గరా విలాసవంతమైన కార్లు ఉన్నాయి. దాదాపు పదేండ్లుగా వివిధ లగ్జరీ కార్లను స్వయంగా నడుపుతున్నారు రితిక. బాల్యం నుంచే తనకు డ్రైవింగ్ అంటే ఇష్టం. హైదరాబాద్‌కు చెందిన సోనమ్ క్లెయిర్ కూడా ఈ క్లబ్లో సభ్యురాలే. తను
బీఎండబ్ల్యూ జెడ్4 యజమాని. ఇటీవల రాజస్థాన్ ఎడారుల్లో ఇసుక తుఫాను సృష్టించారు సోనమ్. తరచూ సమావేశం అవుతూ కార్ల గురించి కబుర్లు చెప్పుకోవాలనీ, రేసింగ్‌కు రంగం సిద్ధం చేసుకోవాలనీ క్లబ్ సభ్యుల తీర్మానం. త్వరలోనే హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించనున్నారు.