కేంద్రం తీరుతో రైతుకు తీవ్రనష్టం

- రైతు వ్యతిరేక చట్టాలతో దేశానికే ముప్పు
- సినీ నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి
భద్రాచలం, అక్టోబర్ 13: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాల వల్ల వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలుగుతున్నదని సినీ నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు చట్టాలతో దేశానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదన్నారు. కరోనా సమయంలో దేశ ప్రజలంతా మాస్కులు ధరించి, శానిటైజర్లు వాడుతూ ఇంట్లో కూర్చుంటే.. ఒక్క రైతు మాత్రమే దేశం కోసం పంటలు పండించారని ఆయన గుర్తుచేశారు. సంక్షోభ సమయంలోనూ అన్నం పెట్టిన రైతులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. రైతు పంటలు పండించకపోతే ఏమవుతుందో ఆలోచించాలన్నారు. మోదీ సర్కార్ కార్పొరేట్లకు అనుకూలంగా రైతు చట్టాలు రూపొందించిందని ధ్వజమెత్తారు. స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని ఎన్నికల్లో గెలిచిన మోదీ.. తర్వాత ఆ హామీని పక్కన పెట్టాడని విమర్శించారు. రైతులకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై ‘రైతన్న’ సినిమా తీశానని, ప్రతిఒక్కరూ ఆ సినిమా చూసి ఆదరించాలని కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

