లండన్: బ్రిటన్ తదుపరి రాణిగా ప్రిన్స్ చార్లెస్ భార్య కామిల్లా అయితే బాగుంటుందని బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 వ్యాఖ్యానించారు. ఆదివారం ఆమె పరిపాలన 70 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. తండ్రి కింగ్ జార్జ్-6 మరణంతో 25 ఏండ్ల వయసులో ఎలిజబెత్-2 బ్రిటన్ రాణిగా పగ్గాలు చేపట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు అప్రతిహతంగా ఆమె బ్రిటన్ను ఏలుతూ వస్తున్నారు. బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం పాటు కొనసాగిన రాణిగా ఎలిజబెత్-2 రికార్డుల్లోకెక్కారు. అన్నీ సజావుగా సాగితే ఎలిజబెత్ తర్వాత ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ కింగ్ కానున్నారు. ఆయన కింగ్ అయితే ఆయన భార్య కామిల్లా క్వీన్ అవుతారు.