స్టార్ల నుంచి సామాన్యుల వరకు టాలీవుడ్ లో ఎవరు ఎలా ఎక్కడినుంచి కాపీ చేశారన్నది రుజువులతో సహా బయటపెడుతున్నారు కొందరు. ఈ కల్చర్ ఈ మధ్యన బాగా ఎక్కువైంది. ఇప్పుడలాంటి కాపీ ఆరోపణల్లో ఇరుక్కున్నాడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతోన్న పుష్ప టీజర్ ఈ కాంట్రవర్సికి కారణమైంది. బన్నీ బర్త్ డే కానుకగా విడుదల చేసి ఈ టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. అయితే ఇందులోని మ్యూజిక్ కాపీ కొట్టారంటూ కొందరు వార్తలు వైరల్ చేస్తున్నారు.
హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాలో ఓ సందర్భంలో వచ్చే బీజీఎమ్ ని కాస్త మార్చి పుష్ప టీజర్ బీజీఎంగా పెట్టేశారని సోషల్ మీడియాలో వార్తలు హడావుడి చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను అల్లు, దేవి ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. పుష్ప టీజర్ రికార్డ్ లు క్రియేట్ చేస్తోందన్న అక్కసుతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.