Madhu Park Ridge | ప్రభుత్వ ప్రతిపాదనేదైనా లిఖిత పూర్వకంగా ఉండాలి : మధు పార్క్ రిడ్జ్ నివాసితుల వినతి
Madhu Park Ridge | మధు పార్క్ రిడ్జ్ బ్లాక్ బి రెసిడెంట్స్‌కు సంబంధించిన అపార్టుమెంట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలో బ్లాక్ బి రెసిడెంట్స్ అసోషియేషన్.. ప్రభుత్వం నుంచి క్లారిటీ కోరింది.
Madhu Park Ridge : మధు పార్క్ రిడ్జ్ బ్లాక్ బి రెసిడెంట్స్‌కు సంబంధించిన అపార్టుమెంట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలో బ్లాక్ బి రెసిడెంట్స్ అసోషియేషన్.. ప్రభుత్వం నుంచి క్లారిటీ కోరింది. ఈ మేరకు అసోషియేషన్ నుంచి ప్రభుత్వానికి లేఖ రాసింది.
‘మా అపార్ట్మెంట్ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన విరుద్ధ ప్రకటనల నేపథ్యంలో మధు పార్క్ రిడ్జ్ నివాసితుల సంఘంగా తాము ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నాం. సీఎం పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ఒక సందర్భంలో మధు పార్క్ రిడ్జ్ను ప్రభుత్వం ఎప్పుడూ స్వాధీనం చేసుకోవాలని అనుకోలేదు అని చెప్పారు. మరో ప్రకటనలో మధు పార్క్ రిడ్జ్ నివాసితులు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారని పేర్కొన్నారు. మా వైఖరి స్పష్టంగా ఉంది. మేం ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ ప్రతిపాదననూ తిరస్కరించలేదు. అంగీకరించనూ లేదు’ అని మధు పార్క్ రిడ్జ్ బ్లాక్ బి రెసిడెంట్స్ అసోషియేషన్ క్లారిటీ ఇచ్చింది.
అదేవిధంగా ‘ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ప్రతిపాదన అయినా నిర్దిష్ట వివరాలతో లిఖితపూర్వకంగా ఉండాలని మేం కచ్చితంగా చెబుతున్నాం. మేం వాటిని చర్చ కోసం మా జీబీఎంలో ఉంచుతాం. దానికి అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

Madhu Park Ridge
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

