ఉద్యోగంలో చేరిన బ్రిటన్ యువరాజు

శాన్ఫ్రాన్సిస్కో: రాచరికానికి గుడ్‌బై చెప్పిన బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ ఓ ఉద్యోగం చూసుకున్నాడు. శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న ఓ స్టార్టప్ కంపెనీలో చీఫ్ ఇంపాక్ట్ ఆఫీసర్‌గా చేరాడు. ఉద్యోగుల మెదళ్లను సానబెట్టడమే ప్రిన్స్ హ్యారీ చేయాల్సిన పని. ఈ కంపెనీ పేరు బెటరప్. మానసికంగా దృఢంగా ఉండటం అనేది చాలా ముఖ్యమని, ఇది మనలోని అంతులేని సామర్థ్యాన్ని వెలికి తీస్తుందని ఈ సందర్భంగా కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో ప్రిన్స్ హ్యారీ చెప్పాడు. ఈ బెటరప్ మొబైల్ ఆధారిత కోచింగ్, కౌన్సెలింగ్, మార్గదర్శకం అందించే సంస్థ. ఈ కంపెనీ విలువ 173 కోట్ల డాలర్లుగా ఉంది. 2013లో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం 270 మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. మొత్తం 2 వేల మంది కోచ్‌ల నెట్వర్క్ ఉంది. రాచరికానికి గుడ్‌బై చెప్పి బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి అమెరికా వచ్చేసిన ప్రిన్స్ హ్యారీ జంట.. ఇప్పుడు సొంత కాళ్లపై నిలబడేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రిన్స్ హ్యారీ ఈ కొత్త ఉద్యోగంలో చేరాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

