Project K Prabhas Look | శాన్ డియాగో కామిక్ కాన్‌లో వింటేజ్ లుక్స్‌తో ప్రభాస్.. ఫోటోలు వైరల్
Project K Prabhas Look | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ప్రాజెక్ట్-K (Project K). నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను ప్రతిష్టాత్మక శాన్ డీగో కామిక్ కాన్ (San Diego Comic-Con (SDCC)) ఈవెంట్ లో రీలీజ్ చేయనున్నారు.
Project K Prabhas Look | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ప్రాజెక్ట్-K (Project K). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను ప్రతిష్టాత్మక శాన్ డీగో కామిక్ కాన్ (San Diego Comic-Con (SDCC)) ఈవెంట్ లో రీలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ కోసం చిత్ర యూనిట్ అంతా అమెరికా బయలుదేరి వెళ్లగా.. ఈరోజు ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చాడు. బ్లూ కలర్ సూట్లో.. వింటేజ్ లుక్స్‌తో కనిపించాడు. ఇక ఈవెంట్లో తమ హీరో లుక్ చూసి చాలా ఎక్జయిట్మెంట్కు లోనవుతున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే, ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) మాత్రం.. ఈ ఈవెంట్ కు హాజరు కావట్లేదు. ఇందుకు ఓ బలమైన కారణం ఉంది. ప్రస్తుతం హాలీవుడ్ లో సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్-అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ (SAG) ఆధ్వర్యంలో ఈ సమ్మె జరుగుతోంది. ఈ ఫెడరేషన్ లో దీపికా కూడా ఓ సభ్యురాలే. SAG లో ని సభ్యులంతా ఎటువంటి షూటింగ్స్ లోనూ, అలాగే సినిమాకు సంబంధించిన ఎటువంటి ప్రమోషన్స్, ఈవెంట్స్ లోనూ పాల్గొనకూడదు. అందుకే SAG కు మద్దతుగా ప్రాజెక్ట్ కె టైటిల్ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ కోసం.. శాన్ డీగో కామిక్ ఈవెంట్ కు దీపిక దూరంగా ఉంటున్నారు.
మరోవైపు గ్లింప్స్ వచ్చేలోపే మేకర్స్ డార్లింగ్ అభిమానులను ఖుషీ చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ లు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా గత రెండు రోజుల నుంచి మూవీటీమ్ వరుస సర్ ప్రైజ్ లు ఇస్తోంది. మొన్న దీపికా పదుకొణె పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. నిన్న ప్రభాస్ లుక్ ను పరిచయం చేసింది.
ఇక ప్రాజెక్ట్ K లో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొణె, దిశా పటానీ (Disha patani) నటిస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్ (Amithab Bachan) కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ (kamal Hasan) ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. వైజయంతీ బ్యానర్ (Vijayanthi Movies)పై అశ్వినీదత్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Side side side please…India’s Biggest star is coming 🔥🔥🔥 #ProjectK #ProjectKGlimpse #Prabhas pic.twitter.com/fyo7OMAfv9
— Ramya Reddy🔥Salaar (@AlwysBeUrself) July 20, 2023
#Prabhas #ProjectKGlimpse #ProjectK pic.twitter.com/jZDSHUp65J
— Prabhas (@PrabhasRaju) July 20, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

