పూర్ణ, తేజ త్రిపురాన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్యాక్‌డోర్’. కర్రి బాలాజీ దర్శకుడు. బి. శ్రీనివాస్‌రెడ్డి నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్‌ను సీనియర్ దర్శకుడు. కె. రాఘవేంద్రరావు విడుదలచేశారు. ఆయన మాట్లాడుతూ ‘ట్రైలర్ బాగుంది. పూర్ణ నటన, బాలాజీ కథను ఆవిష్కరించిన విధానం కొత్తగా ఉన్నాయి’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘తనకంటే వయసులో చిన్నవాడైన యువకుడితో ప్రేమలో పడిన వివాహిత కథ ఇది. వారి అనుబంధం ఎలాంటి అనర్థాలకు దారితీసిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. పూర్ణ కెరీర్లో విభిన్నమైన సినిమాగా నిలుస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది’ అని తెలిపారు.