Pooja Hegde | పూజా హెగ్డే ప్రేమలో పడిందా.. బాలీవుడ్ హీరోతో రిలేషన్‌పై హాట్ టాపిక్!
Pooja Hegde | టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే గత కొంతకాలంగా సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరస్తుంది. ఒకప్పుడు వరుస హిట్స్‌తో దూసుకెళ్లిన ఈ బ్యూటీ, తర్వాత వచ్చిన బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్‌తో కెరీర్లో కాస్త వెనుకబడింది. ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన పూజా, తన అందం మరియు అభినయంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
Pooja Hegde | టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే గత కొంతకాలంగా సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరస్తుంది. ఒకప్పుడు వరుస హిట్స్‌తో దూసుకెళ్లిన ఈ బ్యూటీ, తర్వాత వచ్చిన బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్‌తో కెరీర్లో కాస్త వెనుకబడింది. ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన పూజా, తన అందం మరియు అభినయంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ‘దువ్వాడ జగన్నాథం’, ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అలా వైకుంఠపురంలో’ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకుంది. అయితే ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’ చిత్రాల పరాజయాలు ఆమె కెరీర్‌పై ప్రభావం చూపాయి.
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అవకాశాలు వచ్చినప్పటికీ పెద్దగా హిట్స్ అందుకోలేకపోయింది. దీంతో స్పెషల్ సాంగ్స్ వైపు కూడా అడుగులు వేసింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం పూజా వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో ఆమె ప్రేమలో ఉందనే వార్తలు బీటౌన్‌లో హల్చల్ చేస్తున్నాయి. గతంలో కూడా సల్మాన్ ఖాన్‌తో ఆమె రిలేషన్లో ఉందనే రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల పూజా హెగ్డే , రోహన్ మెహ్రా పలుమార్లు కలిసి కనిపించడం, బయటకు వెళ్లడం వంటి ఘటనలు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన వీరిద్దరూ ప్రస్తుతం సీరియస్ రిలేషన్లో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. త్వరలోనే పూజా హెగ్డే తన రిలేషన్ గురించి క్లారిటీ ఇస్తుందా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం ‘జననాయగన్’ సినిమాతో పాటు దుల్కర్‌తో చేస్తున్న సినిమా మాత్రమే ఆమె చేతిలో ఉండగా, బాలీవుడ్లో మాత్రం ఈ భామ బిజీ నటిగానే కొనసాగుతోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

