బీజాపూర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం
బీజాపూర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు నక్సలైట్లు హతం | ఛత్తీస్గఢ్ బీజాపూర్లోని గల్గాం అటవీ ప్రాంతంలో పోలీసులు, నక్సలైట్ల మధ్య గంటకుపైగా ఎదురుకాల్పులు

రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ బీజాపూర్లోని గల్గాం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులు మధ్య గంటకుపైగా ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం ఉదయం ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో సాయుధ నక్సలైట్లు ఉన్నారన్న సమాచారం అందుకున్న బలగాలు వారి కోసం ఉసూర్ పోలీస్స్టేషన్ పరిధిలో కూంబింగ్ చేపట్టాయి. బలగాలను గమనించిన మావోలు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ప్రతిగా కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని, నక్సలైట్ల కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ గాయపడ్డట్లు బీజాపూర్ ఎస్పీ కమల్ లోచన్ కశ్యప్ తెలిపారు.
మావోలు మృతదేహాలను ఇంకా వెలికి తీయాల్సి ఉందని పేర్కొన్నారు. నక్సలైట్లపై పక్కా సమాచారం వచ్చిందని, ఈ మేరకు వారి కోసం భద్రతా బలగాలు అన్వేషించాయని చెప్పారు. బలగాల రాకను గమనించి మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని, ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారని చెప్పారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతుందని తెలిపారు. తప్పించుకొని పారిపోయిన వారికి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

