నోయిడా: నోయిడాలో టెకీగా పనిచేస్తున్న 26 ఏళ్ల మహిళ మృతి కేసులో ఓ కానిస్టేబుల్‌తో పాటు టెకీని అరెస్టు చేశారు. ఆగస్టు 2వ తేదీన ఆ మహిళ ఓ హెటల్లో అనునాస్పద రీతిలో మృతిచెందింది. నోయిడా సెక్టార్ 49 పోలీస్ స్టేషన్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్‌ను ఈ కేసులో అరెస్టు చేశారు. ఐటీ కంపెనీలో ఆ మహిళతో కలిసి పనిచేస్తున్న ఓ సహఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు బుక్ చేసి విచారణ చేపట్టారు. ఐపీసీ 376, 302 ప్రకారం దర్యాప్తు ప్రారంభించారు. మృతిచెందిన మహిళకు ఆ ఇద్దరూ స్నేహితులని, టెకీ మరణం తర్వాత విచారణ చేపట్టగా ఆ విషయం తెలిసింది. అరెస్టు అయిన కానిస్టేబుల్‌ను సర్వీస్ నుంచి సస్పెండ్ చేశారు. పోస్టుమార్టమ్ రిపోర్ట్‌లో రేప్ జరిగినట్లు తేలలేదు. కానీ ఊపిరాడక ఆమె మృతిచెందినట్లు గుర్తించారు.