సూపర్ మహేష్ బాబు, నమ్రతల సంతానం గౌతమ్, సితారలు నెటిజన్స్‌కు చాలా సుపరిచితం. గౌతమ్ 1 నేనొక్కడినే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇవ్వగా, సితార త్వరలో తళుక్కుమననుందని సమాచారం. తాజాగా అన్నా చెల్లెళ్లు ఇద్దరు సాహసాలతో అందరు నోరెళ్ల పెట్టేలా చేశారు. ఇంట్లోని స్విమ్మింగ్ పూల్‌లో అండర్ వాటర్ స్విమ్మింగ్ చేస్తూ ఆశ్చర్యపరిచారు. వీటికి సంబంధించిన ఫొటోలను నమ్రత తన ఇన్‌స్టాగ్రాములో పోస్ట్ చేయగా, ఇవి సోషల్ మీడియాలో తెగ హల్ చేస్తున్నాయి. సితార ఆ మధ్య దుబాయ్‌కు వెళ్లినప్పుడు కఠినమైన ఎడారిలో మోటార్ రైడింగ్ సాహసం చేసి వావ్ అనిపించిన విషయం తెలిసిందే.