సీనియర్ హీరో కృష్ణ కుటుంబం నుంచి మరో నట వారసుడు తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. నటుడు వీకే నరేష్ సోదరుడి కొడుకు శరణ్ కుమార్ హీరోగా ‘మిస్టర్ కింగ్’ అనే చిత్రం తెరకెక్కుతున్నది. హన్విక క్రియేషన్స్ పతాకంపై బిఎన్ రావు నిర్మిస్తున్నారు. శశిధర్ చావలి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నదీ సినిమా. ఆదివారం కృష్ణ సమక్షంలో సినిమా పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ…‘మంచి వ్యక్తిత్వం ఉంటే రాజు అన్నట్లే. అందుకే ఈ టైటిల్ పెట్టారు. కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా ఆకట్టుకోవాలి. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : మణిశర్మ, సినిమాటోగ్రఫీ : తన్వీర్ అంజుమ్.