బకెట్ నీటి కోసం బావి చుట్టు జనమే.. వీడియో
మేల్ఘాట్: నీటి కష్టాలతో మహారాష్ట్ర ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. బకెట్ నీటి కోసం మైళ్ల దూరం ప్రయాణిస్తున్నారు. మండు టెండలో దాహం తీర్చుకునేందుకు మహిళలు చెమటోడ్చుతున్నారు. అమరావతి జిల్లాలోని మేల్ఘాట్ పర్వత ప్రాంతాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అక్కడ ఉన్న గిరిజన ప్రజలు నీళ్ల కోసం ప్రాణాలకే తెగిస్తున్నారు. ఖాదియాల్ గ్రామంలో ఉన్న రెండు బావిల వద్ద మాత్రమే నీరు దొరుకుతోంది. దీంతో స్థానికులు చెప్పలేని కష్టాలు అనుభవిస్తున్నారు. గ్రామంలో ఉన్న బావిల్లో నీటి తోడేందుకు జనం ఎగబడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా వచ్చిన నీటిని ముందుగా బావిలోకి వదులుతున్నారు. ఆ తర్వాత ఆ నీటిని అక్కడి జనం బకెట్లు, బిందెలతో తోడుకుంటున్నారు. చాలా హృదయవిదారకర రీతిలో మేల్ఘాట్ ప్రజలు జీవిస్తున్నారు. బావి నుంచి తోడిన నీళ్లు మురికి మురికిగా ఉంటున్నాయని, అవి తాగడం వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
#WACTH | Maharashtra: People of Khadial village in Melghat are risking their lives for a bucket of water
"There are only two wells in the village which have almost dried up, a village of 1500 population is dependent on 2-3 tankers for water every day", said a villager pic.twitter.com/5tWAjDgqci
— ANI (@ANI) June 10, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

