ఎయిర్ ప్యూరిఫైయర్లను విరాళంగా ఇవ్వనున్న మోలేకులే, పంజాబ్ యూనివర్సిటీ

ఢిల్లీ ,జూన్ 1: పంజాబ్ విశ్వవిద్యాలయం తీసుకున్న చొరవతో చండీఘర్, పంజాబ్, ఉత్తరాఖండ్,హిమాచల్ ఆసుపత్రుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్లు ఏర్పాటుకానున్నాయి. ఎయిర్ ప్యూరిఫైయర్లను తయారు చేయడానికి అమెరికాకు చెందిన మోలేకులేతో పంజాబ్ విశ్వవిద్యాలయంలో డిఎస్టీ ఆమోదం పొందిన అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ సెంటర్ అవగాహన కుదుర్చుకున్నది. ఎయిర్ ప్యూరిఫైయర్ల వల్ల కోవిడ్ వార్డులు, ఐసీయూలలో వెంటిలేషన్ సౌకర్యాలు మెరుగుపడతాయి.ఎయిర్ ప్యూరిఫైయర్లను ఉత్పత్తి రంగంలో మోలేకులే ఉంది. ఈ సంస్థ కోసం విడిభాగాలను బిగించి ఎయిర్ ప్యూరిఫైయర్లను దేశంలో సిద్ధం చేయడానికి పంజాబ్ విశ్వవిద్యాలయం అంగీకరించింది. తొలుత పది ఆసుపత్రుల్లో వీటిని నెలకొల్పుతారు. ఆ తరువాత వీటి సంఖ్య పెంచనున్నారు.
ఈ భాగస్వామ్యం వల్ల దేశం వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులకు మోలేకులే ఎయిర్ ప్యూరిఫైయర్లను, ఎయిర్ ప్రో ఆర్ఎక్స్ యూనిట్లను విరాళంగా అందించింది. ఇంతవరకు ఆరు రాష్ట్రాలకు ఈ సహాయం అందింది. కోవిడ్ సమస్యను ఎదుర్కొంటున్న అన్ని రాష్ట్రాలకు ఎయిర్ ప్యూరిఫైయర్లను అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎయిర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేయడం వల్ల ఆసుపత్రుల్లో రోగులు, డాక్టర్లు, వైద్య సిబ్బందికి స్వచ్ఛమైన గాలి ధారాళంగా అందుతుంది. ఎయిర్ ప్యూరిఫైయర్లు ఆసుపత్రుల లోపల వీచే గాలిని శుద్ధి చేసి వెంటిలేషన్ సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనితో గాలి ద్వారా కోవిడ్-19 వైరస్ క్రిములు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉండదు. దీనితో కోవిడ్-19 రూపంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించి, స్వచ్ఛమైన వాతావరణంలో పనిచేయడానికి ఆరోగ్య సిబ్బందికి అవకాశం కల్పించడానికి వీలవుతుంది.

వైరస్, బాక్టీరియా, బూజు, ఇతర రసాయనాలు గాలి ద్వారా వ్యాప్తి చెందకుండా చూడడానికి మోలేకులే అభివృద్ధి చేసిన పెట్రో కెమికల్ ఆక్సిడేషన్ సాంకేతికతో ఎయిర్ ప్యూరిఫైయర్లను ఉత్పత్తి చేస్తోంది. దీనివల్ల కరోనా వైరస్ క్రిములు, హెచ్ 1ఎన్ 1 క్రిములు గాలి ద్వారా వ్యాపించే వైరస్, బూజు, బాక్టీరియా 99.99శాతం వరకు నిర్వీర్యం అవుతున్నాయని పరిశోధనల్లో వెల్లడయ్యింది. మోలేకులే నుంచి తొలిసారిగా అందిన ఎయిర్ ప్యూరిఫైయర్ మినీ, మోలేకులే ఎయిర్ ప్రో ఆర్ఎక్స్ యూనిట్లు పంజాబ్ విశ్వవిద్యాలయంకి చేరాయి. వీటిని విశ్వవిద్యాలయ అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ సెంటర్ లో బిగించి పరీక్షించారు.
అత్యవసర విభాగాలు, ఐసీయూ లు లాంటి ప్రాంతాల్లో ఉపయోగించడానికి అమెరికా పరిస్థితులకు అనుగుణంగా మోలేకులే పరికరాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తి చేయడం వల్ల కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలు మరింత సమర్ధంగా అమలు జరగడానికి అవకాశం కలుగుతుంది.పంజాబ్ విశ్వవిద్యాలయంతో పాటు ఇతర ప్రాంతాల్లో డీఎస్టీ సహకారంతో పని చేస్తున్న సాంకేతిక కేంద్రాల సహకారంతో కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి అవకాశం ఉందని డీఎస్టీ కార్యదర్శి ప్రొఫెసర్. అశుతోష్ మిశ్రా అన్నారు. మానవ మేధస్సుకు అధునాతన పరికరాలు, వ్యవస్థలు తోడైతే ఏ సమస్యను అయినా ఎదుర్కోవడానికి వీలవుతుంది అని ఆయన అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

