విశ్వాసపరీక్షలో నెగ్గిన ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ జాతీయ పార్లమెంట్లో ఇవాళ జరిగిన విశ్వాస పరీక్షలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నెగ్గారు. ఇమ్రాన్‌కు 178 ఓట్లు పోలయ్యాయి. అవసరమైన దాని కన్నా ఆరు ఓట్లు ఎక్కువగా పడ్డాయి. ఇటీవల సేనేట్‌లో పాకిస్థాన్ తెహ్రీక్ పార్టీ అనూహ్య ఓటమి ఎదుర్కొన్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఇవాళ బలపరీక్షకు నిలిచారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ సమావేశంలో ఓటింగ్ నిర్వహించారు. విశ్వాస పరీక్ష నెగ్గేందుకు ఇమ్రాన్‌కు కేవలం 172 ఓట్లు కావాల్సి ఉంది. కానీ ఆయనకు మరో ఆరు ఓట్లు అధికంగానే పోలయ్యాయి. పీటీఐకి చెందిన ఎంపీలు సుమారు 155 మంది మొత్తం ఆయనకే ఓటేశారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మద్దుతుగానే ఎంక్యూఎం-పీ, బలోచిస్తాన్ అవామీ పార్టీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్-క్వయిద్, గ్రాండ్ డెమోక్రటిక్ అలియన్స్‌కు చెందిన ఎంపీలు ఓటు వేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థి అస్లమ్ బొతానికి కూడా ప్రధానికే ఓటేశారు. తనకు ఓటేసిన పార్టీ ఎంపీలు, మిత్రపక్ష ఎంపీలకు ఇమ్రాన్ థ్యాంక్స్ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

