OnePlus 11 Pro | హాట్ ఫీచర్లతో కస్టమర్ల ముందుకు రానున్న వన్‌ప్లస్ 11 ప్రొ
వన్‌ప్లస్ 11 ప్రొ ఫోటోలు గత వారం ఆన్లైన్లో హల్చల్ చేయగా తాజాగా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఆన్లైన్లో లీకయ్యాయి.
న్యూఢిల్లీ : వన్‌ప్లస్ 11 ప్రొ ఫోటోలు గత వారం ఆన్లైన్లో హల్చల్ చేయగా తాజాగా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఆన్లైన్లో లీకయ్యాయి. వన్‌ప్లస్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. నవంబర్ సమ్మిట్‌లో క్వాల్‌కాం లాంఛ్ చేయనున్న స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్తో ఈ స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల ముందుకు రానుందని భావిస్తున్నారు.
వన్‌ప్లస్ 11 ప్రొ 6.7 ఇంచ్ క్యూహెచ్డీ+ రిజల్యూషన్‌తో కూడిన అమోల్డ్ స్క్రీన్, పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుందని 91మొబైల్స్ వెల్లడించింది. వన్‌ప్లస్ లేటెస్ట్ 11 ప్రొ డివైజ్ 100డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. మొబైల్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ రానుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 48ఎంపీ అల్ట్రావైడ్ సెన్సర్, 2x ఆప్టికల్ జూమ్‌తో 32ఎంపీ టెలిఫోటో సెన్సర్ ఉంటుంది.
మెరుగైన కలర్ గ్రేడింగ్, ఓవరాల్ పెర్ఫామెన్స్ కోసం కెమెరాలు హ్యాసిల్బ్లాడ్ సపోర్ట్ కలిగిఉంటాయి. ఇక ముందు భాగంలో సెల్ఫీల కోసం 16ఎంపీ కెమెరా ఆకట్టుకోనుంది. ఈ డివైజ్ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో పాటు డాల్బీ అట్మాస్‌ను సపోర్ట్ చేస్తుంది. కిందిభాగంలో యూఎస్బీ-సీ పోర్ట్ ఉంటుందని లీక్ పేర్కొంది. వన్‌ప్లస్ లేటెస్ట్ డివైజ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌గా కస్టమర్ల ముందుకు రానుంది. ఇక ఈ ఏడాది చివరిలో లేదా 2023 జనవరిలో వన్‌ప్లస్ 11 ప్రొ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

