అమ్మకు అంకితం

శర్వానంద్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ కార్తిక్ దర్శకుడు. రీతూవర్మ కథానాయిక. అమల అక్కినేని కీలక పాత్రధారి. ఈ చిత్రంలోని ‘అమ్మ పాట’ను బుధవారం హీరో అఖిల్ అక్కినేని విడుదలచేశారు. ఈ గీతాన్ని తన తల్లి అమలకు అంకితమిచ్చారాయన. దివంగత గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చిన ఈ గీతాన్ని సిధ్‌శ్రీరామ్ ఆలపించారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్నందించారు. ‘సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అమ్మ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి మాతృమూర్తికి అంకితం ఇచ్చేలా ఈ పాట ఉంటుంది’ అని నిర్మాతలు చెప్పారు. వెన్నెలకిషోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సుజిత్ సారంగ్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

