జొకోకు ఊరట
- వీసా రద్దు పునరుద్ధరణ..
- నిర్బంధ కేంద్రం నుంచి విడుదల
- ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ

మెల్బోర్న్: ప్రపంచ నంబరవన్ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జొకోవిచ్‌కు ఊరట లభించింది. ఆస్ట్రేలియాలో తనకు ఎదురైన పరాభవంపై చేసిన న్యాయ పోరాటం ఫలించింది. ఫెడరల్ కోర్టు ఆదేశాలతో జొకో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు అడ్డంకులు దాదాపు తొలిగిపోయాయి. రద్దయిన వీసాను పునరుద్ధరించడంతో పాటు.. నిర్బంధ కేంద్రం నుంచి జొకోను విడిచిపెట్టాలని న్యాయస్థానం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఆరంభ సీజన్ టోర్నీ కోసం ప్రత్యేక వైద్య మినహాయింపులతో గత బుధవారం సెర్బియా స్టార్ జొకో మెల్బోర్న్ చేరుకోగా విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. నాలుగు రోజుల పాటు ఓ హోటల్లో క్వారంటైన్లో ఉంచారు. దీనిపై జొకో ఫెడరల్ కోర్టును ఆశ్రయించగా.. సోమవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. అనంతరం కోర్టు జడ్జి ఆంటోనీ కెల్లీ.. టెన్నిస్ స్టార్ జొకో పట్ల అధికారులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు.
వీసా రద్దును పునరుద్ధరించడంతోపాటు 30 నిమిషాల్లో జొకోను క్వారంటైన్ కేంద్రం నుంచి విడిచిపెట్టాలని ఆదేశించారు. ఈ ఆదేశాలతో జొకో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. అంతకుముందు శనివారం జొకో తరఫు న్యాయవాదులు కోర్టుకు పలు పత్రాలు సమర్పించారు. డిసెంబర్లో కరోనా సోకడంతోనే ప్రత్యేక మినహాయింపు ఇచ్చారని చెబుతూ ఆధారాలు కోర్టు ముందు ఉంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం పైవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే జొకోకు ఒకింత ఊరట లభించినప్పటికీ వివాదం ఇంకా సమసిపోలేదని తెలుస్తున్నది. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఇమిగ్రేషన్ మంత్రి జొకో వీసాను తిరిగి రద్దు చేయడంతో పాటు ఆస్ట్రేలియాలో పర్యటించకుండా మూడేండ్ల పాటు నిషేధం విధించే అవకాశముందని ప్రభుత్వ న్యాయవాది క్రిస్టోఫర్ ట్రాన్ పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

