Khushbu | ఆ విషయాన్ని చెప్పినందుకు నేనేమీ సిగ్గుపడట్లేదు : ఖుష్బూ
Khushbu Sundar | తన చిన్నతనంలో జరిగిన లైంగిక వేధింపుల (sexually abused) గురించి ఇటీవల నటి ఖుష్బూ (Khushbu Sundar) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై తాజాగా ఆమె స్పందించారు. తనకు జరిగిన అన్యాయాన్ని బయట ప్రపంచానికి చెప్పినందుకు తాను ఏమాత్రం సిగ్గుపడం లేదన్నారు.
Khushbu Sundar | తన చిన్నతనంలో జరిగిన లైంగిక వేధింపుల (sexually abused) గురించి ఇటీవల నటి ఖుష్బూ (Khushbu Sundar) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన తండ్రి వల్ల తాను లైంగిక వేధింపులు (sexually abused) ఎదుర్కొన్నానంటూ చెప్పుకొచ్చారు. ఆ వ్యాఖ్యలపై తాజాగా ఆమె స్పందించారు. తనకు జరిగిన అన్యాయాన్ని బయట ప్రపంచానికి చెప్పినందుకు తాను ఏమాత్రం సిగ్గుపడం లేదన్నారు.
‘ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. నాకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా, నిజాయితీగా అందరికీ తెలియజేశాను. ఆ విషయాన్ని చెప్పినందుకు నేనేమీ సిగ్గుపడటం లేదు. ఎందుకంటే ఆ ఘటన నాకు జరిగింది కాబట్టి. నాపై ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తి సిగ్గుపడాలి. అలాగే మహిళలందరూ ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. మిమ్మల్ని కించపరిచే వాటిని ప్రోత్సహించకూడదు. నాకు జరిగిన దారుణాన్ని అందరితో చెప్పడానికి సమయం తీసుకొని ఉండొచ్చు. నాలాగా ప్రతి ఒక్కరూ తమకు ఎదురైన వేధింపుల గురించి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాలి. తమ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నా’ అని ఆమె వివరించారు.
ఖుష్బూ ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింది. తన తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. అయితే అప్పుడు తన వయసు ఎనిమిదేళ్లని, పదిహేనేళ్లు వచ్చాక తన తండ్రిని ఎదిరించానని చెప్పింది. దాంతో తన తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడని తెలిపింది. లైంగిక వేధింపులపై ప్రస్తుతం కుష్బూ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ముంబైలో ముస్లిం కుటుంబంలో జన్మించిన ఖుష్బూ చిన్ననాటి నుంచి నటనపై ఆసక్తిపెంచుకుంది. వినోద్‌ఖన్నా హీరోగా నటించిన ‘ద బర్నింగ్ ట్రైన్’ సినిమాతో తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది. ఇక ఖుష్బూ తమిళ దర్శకుడు, నటుడు సి.సుందర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.
Also Read..
Iran | బాలికలపై విషప్రయోగం.. విద్యార్థుల తల్లిదండ్రులు సహా పలువురి అరెస్ట్
MLC Kavitha | తెలంగాణ తల వంచదు : ఎమ్మెల్సీ కవిత
Kejriwal: హోలీ జరుపుకోని కేజ్రీవాల్.. రాజ్‌ఘాట్‌లో నివాళి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

