Aliens: గ్రహాంతరవాసులు కాదు.. స్పష్టం చేసిన వైట్‌హౌజ్
aliens : అమెరికాపై ఎగిరిన వస్తువులు ఏలియన్స్ కాదు అని వైట్‌హౌజ్ స్పష్టం చేసింది. ఇటీవల వరుసగా నాలుగు సార్లు ఆ దేశ యుద్ధ విమానాలు ఆకాశంలో ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువుల్ని కూల్చిన విషయం తెలిసిందే.
న్యూయార్క్: ఇటీవల అమెరికా తన గగనతలంపై ఎగురుతున్న గుర్తు తెలియని కొన్ని వస్తువుల్ని ఫైటర్ జెట్లతో పేల్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వస్తువులు ఏలియన్స్ అయి ఉంటారని ఊహాగానాలు వినిపించాయి. గ్రహాంతరవాసులు కాదన్న విషయాన్ని కొట్టిపారేయలేమని కూడా అమెరికా వైమానిక చీఫ్ కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం వైట్‌హౌజ్ ఓ ప్రకటన చేసింది. ఏలియన్స్ కానీ.. గ్రహాంతర జీవులకు చెందిన కదలికలు ఏవీ లేవని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కారిన్ జీన్ పెర్రీ తెలిపారు.
మీడియాతో ఆమె మాట్లాడుతూ.. శ్వేత సౌధం నుంచి ఈ ప్రకటన చేస్తున్నట్లు గమనించాలని, కొన్ని వస్తువుల్ని పేల్చివేసిన అంశంలో అపోహలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, ఆ పేల్చివేతలకు ఏలియన్స్‌తో కానీ, గ్రహాంతర జీవుల కదిలికలతో ఎటువంటి సంబంధం లేదని పెర్రీ తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీన చైనాకు చెందిన నిఘా బెలూన్ను పేల్చివేసిన తర్వాత వరుసగా అమెరికా మరో నాలుగు గుర్తు తెలియని ఫ్లయింగ్ ఆబ్జెక్టలను పేల్చివేసింది.
గుర్తు తెలియని వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని మరింత సేకరిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. సెక్యూర్టీ సమస్యలు తీసుకువచ్చే ఎటువంటి అంశాన్ని అయినా డిస్పోజ్ చేయాలని బైడెన్ ఆదేశాలు ఇచ్చిన కిర్బీ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

