Nithiin32 | మారేడుమిల్లి అడవుల్లో నితిన్ కొత్త సినిమా ప్రారంభం..!
యువ హీరో నితిన్ ప్రస్తుతం ఒక మంచి హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. 'భీష్మ' తర్వాత ఇప్పటివరకు నితిన్‌కు మరో హిట్టు లేదు. ఇక ఇటీవలే భారీ అంచనాలతో రిలీజైన 'మాచర్ల నియోజక వర్గం' బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
Nithiin-Vakkantham Vamshi Movie | యువ హీరో నితిన్ ప్రస్తుతం ఒక మంచి హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. ‘భీష్మ’ తర్వాత ఇప్పటివరకు నితిన్‌కు మరో హిట్టు లేదు. ఇక ఇటీవలే భారీ అంచనాలతో రిలీజైన ‘మాచర్ల నియోజక వర్గం’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజు నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్‌గా మిగిలింది. ప్రస్తుతం నితిన్ ఆశలన్ని వక్కంతం వంశీ సినిమాపైనే ఉన్నాయి. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత వంశీ దాదాపు నాలుగేళ్ళు గ్యాప్ తీసుకుని నితిన్‌తో రెండో సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రథమార్థంలో పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన ఈ చిత్రం తాజాగా షూటింగ్ ప్రారంభించింది.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజాగా ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభించింది. మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ ఎపిసోడ్లో చిత్రబృందం నితిన్‌పై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనుంది. ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. నితిన్‌కు జోడీగా పెళ్ళిసందD బ్యూటీ శ్రీలీల నటిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది ప్రథమార్థంలోపు పూర్తి చేసి.. సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.
సక్సెస్ ఫుల్ రైటర్‌గా టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వంశీ.. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ ఫేయిల్యూర్‌గా మిగిలింది. దాంతో ఈ సారి ఎలాగైన నితిన్‌తో బ్లాక్‌బస్టర్ హిట్టు సాధించాలని కసితో ఉన్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

