నీరవ్ మోదీ కేసులో యూకే జడ్జి కీలక తీర్పు

లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు 14వేల కోట్లు ఎగొట్టిన కేసులో నీరవ్ మోదీపై ఇవాళ లండన్ కోర్టులో విచారణ జరిగింది. ఆ కేసులో నీరవ్ మోదీని దోషిగా తేల్చేందుకు కావాల్సిన అన్ని ఆధారాలు ఉన్నట్లు న్యాయమూర్తి తెలిపారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసు రెండున్నర ఏళ్లుగా యూకే కోర్టులో విచారణ జరుగుతోంది. మోసం, మనీల్యాండరింగ్ కింద అతనిపై ఆరోపణలు ఉన్నాయి. వాండ్స్‌వర్త్ జైలు నుంచి అతను ఇవాళ వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణకు హాజరయ్యాడు. డిస్ట్రిక్ జడ్జి సామ్యూల్ గూజీ ఈ కేసులో తీర్పును వెలువరించారు. అయితే మనీల్యాండరింగ్ కేసులో నీరవ్ మోదీని దోషిగా తేల్చేందుకు కావాల్సిన సాక్ష్యాధారాలు ఉన్నట్లు ఆ జడ్జి తెలిపారు. మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును యూకే హోంశాఖ మంత్రి ప్రీతిపాటిల్‌కు తెలియజేయనున్నారు. పీఎన్బీకి కోట్లు ఎగవేసిన కేసులో నీరవ్‌ను అప్పగించాలని బ్రిటన్ను భారత్ కోరుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ నీరవ్‌ను భారత్‌కు అప్పగిస్తే, అక్కడ ఆయనకు న్యాయం జరగదన్న దాంట్లో వాస్తవం లేదని కూడా కోర్టు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. నీరవ్‌కు వ్యతిరేకంగా భారత్ తమకు 16 సంపుటాల ఆధారాలను సమర్పించిందని, భారత ప్రభుత్వం సమర్పించిన ఆధారాలను గుర్తిస్తున్నట్లు జడ్జి వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

