ఆర్టికల్ 168 ప్రకారం రాష్ట్ర శాసనసభ అంటే?

- గవర్నర్‌కు సంబంధించి కింది వాటిలో
సరికానిది?
1) గవర్నర్ వ్యవస్థను 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించారు
2) గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించే
విధానాన్ని కెనడా నుంచి గ్రహించారు
3) గవర్నర్‌గా ఎన్నిక కావాలంటే ఉండాల్సిన కనీస వయస్సు 30 సంవత్సరాలు
4) గవర్నర్ రాష్ర్టాధినేతగా వ్యవహరిస్తారు - గవర్నర్ పదవికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) గవర్నర్ పదవీ కాలం నిర్దిష్టంగా ఐదు సంవత్సరాలు
2) గవర్నర్ పదవీ కాలం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు
3) గవర్నర్ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి
4) గవర్నర్ వేతనం రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు - కింది అంశాల్లో సరికానిదానిని గుర్తించండి?
1) రాష్ర్టానికి ప్రథమ పౌరుడు గవర్నర్
2) రాష్ట్ర పరిపాలన గవర్నర్ పేరుమీద
నిర్వహిస్తారు
3) రాష్ట్ర పరిపాలన సీఎం పేరుమీద
నిర్వహిస్తారు
4) గవర్నర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు - గవర్నర్ పదవికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) గవర్నర్ నివాసం- రాజ్‌భవన్
2) గవర్నర్‌ను రాష్ట్ర శాసనసభ అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగిస్తారు
3) గవర్నర్ జీతభత్యాలను పార్లమెంట్
నిర్ణయిస్తుంది
4) గవర్నర్‌గా నియమితులు కావాలంటే ఉండాల్సిన కనీస వయస్సు 35 సంవత్సరాలు - గవర్నర్ ద్వారా నియమితులయ్యేవారు?
1) హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు
2) ముఖ్యమంత్రి, మంత్రులు
3) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ - గవర్నర్ శాసనాధికారాలకు సంబంధించి సరికానిది?
1) శాసనసభ ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదిస్తే చట్టాలుగా మారుతాయి
2) గవర్నర్ రాష్ట్ర విధాన సభకు ఒక ఆంగ్లో-ఇండియన్‌ను నామినేట్ చేస్తారు
3) గవర్నర్ రాష్ట్ర విధాన పరిషత్‌కు 1/6వ వంతు సభ్యులను నామినేట్ చేస్తారు
4) గవర్నర్ రాష్ట్రస్థాయిలో ఉభయసభల సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తారు - రాష్ట్ర శాసనసభ సమావేశాలు లేనప్పుడు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర మంత్రి మండలి సిఫారసుల మేరకు ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్ జారీచేసే ఆదేశాన్ని ఏమంటారు?
1) నియోజిత శాసనం 2) ఆర్డినెన్స్
3) రెమ్యునరేషన్ 4) అత్యవసర నియమం - కింది వాటిలో గవర్నర్ శాసనాధికారానికి సంబంధించి సరికానిది?
1) గవర్నర్ శాసనసభ సమావేశాలను ప్రారంభించడాన్ని ‘సమన్స్’ అంటారు
2) గవర్నర్ శాసనసభ సమావేశాలను దీర్ఘకాలం వాయిదా వేయడాన్ని ‘ప్రోరోగ్’ అంటారు
3) గవర్నర్ విధాన సభను రద్దు చేయడాన్ని ‘డిజాల్వ్’ అంటారు
4) గవర్నర్ శాసనసభ సమావేశాలను వాయిదా వేయడాన్ని ‘అడ్జర్న్’ అంటారు - గవర్నర్ ఆర్థిక అధికారాలకు సంబంధించి సరికానిది?
1) రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను గవర్నర్ తన అనుమతి ద్వారానే శాసనసభలో ప్రవేశపెట్టాలి
2) రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నర్ పునర్వ్యవస్థీకరిస్తారు
3) రాష్ట్ర సంఘటిత నిధి గవర్నర్ నియంత్రణలో ఉంటుంది
4) కాగ్ రాష్ట్ర వార్షిక నివేదికను గవర్నర్‌కు సమర్పిస్తారు - గవర్నర్ న్యాయాధికారాలకు సంబంధించి సరికానిది?
1) పదవిలో ఉన్న గవర్నర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయరాదు
2) మరణశిక్షలకు గవర్నర్ క్షమాభిక్షను ప్రసాదిస్తారు
3) హైకోర్టు సిఫారసుల మేరకు గవర్నర్ కింది కోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు
4) పదవీ కాలంలో చేపట్టిన పనులకు గాను పదవీ విరమణ అనంతరం గవర్నర్ ఏ న్యాయస్థానానికి బాధ్యులు కాదు - 1984లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని రద్దు చేసి నాదెండ్ల భాస్కరరావుని సీఎంగా నియమించి వివాదాస్పదం అయిన అప్పటి గవర్నర్?
1) బీమ్సేన్ జోషి 2) రాంలాల్
3) శంకర్‌దయాల్ శర్మ 4) రఘురాం - గవర్నర్ పదవికి సంబంధించి కింది వాటిలో సరికాని దానిని గుర్తించండి?
1) భారత్‌లో తొలి మహిళా గవర్నర్-
సరోజినీ నాయుడు
2) ఆంధ్ర రాష్ర్టానికి తొలి గవర్నర్-
చందూలాల్ మాధవ్
3) ఆంధ్రప్రదేశ్‌కు తొలి మహిళా గవర్నర్- శారదా ముఖర్జీ
4) ఆంధ్రప్రదేశ్‌కు తొలి గవర్నర్-
ఎస్ఎం నగేశ్ - ముఖ్యమంత్రి పదవికి సంబంధించి సరికానిది?
1) రాష్ట్ర క్యాబినెట్‌కు అధిపతిగా
వ్యవహరిస్తారు
2) ముఖ్యమంత్రి మరణించినా, తన పదవికి రాజీనామా చేసినా మొత్తం మంత్రి మండలి రద్దవుతుంది
3) ముఖ్యమంత్రి తన రాజీనామాను ప్రధానమంత్రికి సమర్పించాలి
4) ముఖ్యమంత్రి రాష్ట్రప్రభుత్వానికి
అధినేతగా వ్యవహరిస్తారు - కింది వాటిలో సరికాని దానిని గుర్తించండి?
1) విధాన పరిషత్ సభ్యత్వంతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టే వీలు లేదు
2) ముఖ్యమంత్రి సాధారణంగా విధాన సభకు నాయకుడిగా వ్యవహరిస్తారు
3) ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి వ్యక్తిగతంగా గవర్నర్‌కు బాధ్యత వహిస్తుంది
4) ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి సమష్టిగా విధాన సభకు బాధ్యత వహిస్తుంది - రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయే మార్గాల్లో లేని దానిని గుర్తించండి?
1) విధానసభలో బడ్జెట్ తిరస్కరణకు గురైనప్పుడు
2) విధాన సభలో విశ్వాస తీర్మానం ఓడిపోయినప్పుడు
3) విధాన సభలో అవిశ్వాస తీర్మానం ఓడిపోయినప్పుడు
4) విధాన సభలో కోత తీర్మానాలు నెగ్గినప్పుడు - ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలికి సంబంధించి సరికానిది?
1) విధాన సభలోని మెజారిటీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమిస్తారు
2) ముఖ్యమంత్రి సిఫారసుల మేరకు మంత్రులను గవర్నర్ నియమిస్తారు
3) ముఖ్యమంత్రి గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి
4) మంత్రి మండలి సభ్యులు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి - ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు?
1) శాసనసభ 2) పార్లమెంట్
3) గవర్నర్ 4) రాష్ట్రపతి - రాష్ట్ర మంత్రిమండలి పరిమాణానికి సంబంధించి 91వ రాజ్యాంగ సవరణ చట్టం-2003 ప్రకారం వాజ్‌పేయి ప్రభుత్వం నిర్ణయించిన అంశాన్ని గుర్తించండి?
1) మంత్రిమండలి సభ్యుల సంఖ్య విధాన సభ సభ్యుల సంఖ్యలో 15 శాతం మించరాదు
2) మంత్రి మండలి సభ్యుల సంఖ్య చిన్న రాష్ర్టాల్లో 12 మంది కంటే తక్కువ ఉండరాదు
3) 1, 2 4) ఏదీకాదు - 94వ రాజ్యాంగ సవరణ చట్టం 2006 ప్రకారం కింది ఏ రాష్ట్రంలో తప్పనిసరిగా ‘గిరిజన సంక్షేమ మంత్రి’ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు?
1) మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ 2) జార్ఖండ్
3) బీహార్ 4) ఒడిశా - ముఖ్యమంత్రి అధికారాలు విధులకు సంబంధించి కింది వాటిలో సరికానిదానిని గుర్తించండి?
1) రాష్ట్ర ప్రణాళికా సంఘానికి అధ్యక్షత
వహిస్తారు
2) మంత్రిమండలికి గవర్నర్‌కు మధ్య
సంధానకర్తగా వ్యవహరిస్తారు
3) రాష్ట్ర పరిపాలనకు సమన్వయకర్తగా
వ్యవహరిస్తారు
4) అంతర్రాష్ట్ర మండలి అధ్యక్షుడిగా
వ్యవహరిస్తారు - ముఖ్యమంత్రి పదవిరీత్యా కింది ఏ సంస్థ/వ్యవస్థలో సభ్యుడిగా ఉంటారు?
1) జాతీయ అభివృద్ధి మండలి, నీతి ఆయోగ్
2) జాతీయ సమైక్యత మండలి
3) జోనల్ కౌన్సిల్, అంతర్రాష్ట్ర మండలి
4) పైవన్నీ సరైనవే - వివిధ ముఖ్యమంత్రులకు సంబంధించి సరికానిది గుర్తించండి?
1) ఆంధ్ర రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి- టంగుటూరి ప్రకాశం
2) ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి- టంగుటూరి అంజయ్య
3) హైదరాబాద్ రాష్ర్టానికి తొలి, చివరి ముఖ్యమంత్రి- బూర్గుల రామకృష్ణారావు
4) భారత్‌లో తొలి మహిళా ముఖ్యమంత్రి- సుచేత కృపలాని - కింది ముఖ్యమంత్రులకు సంబంధించి సరికానిది?
1) దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి- దామోదరం సంజీవయ్య
2) ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి-
నీలం సంజీవరెడ్డి
3) దేశంలో తొలి దళిత మహిళా
ముఖ్యమంత్రి- మాయావతి
4) దేశంలో పదవిలో ఉండగా మరణించిన తొలి ముఖ్యమంత్రి- రాజశేఖర్ రెడ్డి - శాసనసభలో సభ్యత్వం లేకుండానే ముఖ్యమంత్రి పదవిని చేపట్టి, తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి పదవిని కోల్పోయింది?
1) త్రిభువన్ నారాయణ్ సింగ్ (ఉత్తరప్రదేశ్)
2) శిబూసోరెన్ (జార్ఖండ్)
3) 1, 2 4) షీలాదీక్షిత్ (న్యూఢిల్లీ) - వివిధ ముఖ్యమంత్రుల ప్రత్యేకతలకు సంబంధించి సరికానిది?
1) దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది- పవన్ కుమార్ చామ్లింగ్
2) భారత్‌లో తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది- జగదాంబికా పాల్
3) ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది- నాదెండ్ల భాస్కరరావు
4) ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది- కే రోశయ్య - శాసనసభలో సభ్యత్వంలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా లేదా రాష్ట్రమంత్రిగా నియమితులయితే ఎంతకాలంలోగా శాసనసభలో సభ్యత్వం పొందలేకపోతే ఆ వ్యక్తి పదవిని కోల్పోతారు?
1) 6 నెలలు 2) 3 నెలలు
3) 2 నెలలు 4) 12 నెలలు - ఏదైనా రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ రాష్ట్రంలో వాస్తవ కార్యనిర్వహణాధికారాలు ఎవరికి లభిస్తాయి?
1) రాష్ట్రపతి 2) గవర్నర్
3) ప్రధానమంత్రి 4) ముఖ్యమంత్రి - గవర్నర్ వ్యవస్థపై సర్కారియా కమిషన్ సిఫారసులను గుర్తించండి?
1) క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనేవారిని గవర్నర్లుగా నియమించరాదు
2) ఒక వ్యక్తిని సొంత రాష్ర్టానికి గవర్నర్‌గా నియమించరాదు
3) గవర్నర్‌గా పదవీ బాధ్యతలు పూర్తయిన వ్యక్తి తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించరాదు
4) పైవన్నీ సరైనవే - రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం రాష్ట్ర శాసనసభ అంటే?
1) విధాన సభ + విధాన పరిషత్
2) విధాన సభ + విధాన పరిషత్ + గవర్నర్
3) విధాన సభ + విధాన పరిషత్ +
ముఖ్యమంత్రి
4) విధాన సభ + విధాన పరిషత్ +
మంత్రిమండలి - విధాన సభకు సంబంధించి కింది వాటిలో సరికానిదానిని గుర్తించండి?
1) విధాన సభను దిగువ సభ, ప్రజాప్రతినిధుల సభ అనిశ్చిత సభ అంటారు
2) విధాన సభకు పోటీ చేయాలంటే ఉండాల్సిన కనీస వయస్సు- 25 సంవత్సరాలు
3) విధాన సభ పదవీకాలం నిర్దిష్టంగా 5 సంవత్సరాలు
4) విధాన సభ సభ్యులను ఎమ్మెల్యేలు అంటారు - విధాన సభకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) విధాన సభను పదవీకాలం కంటే ముందే గవర్నర్ రద్దు చేయగలరు
2) భారతీయ అత్యవసర పరిస్థితి కాలంలో విధాన సభ పదవీకాలాన్ని అదనంగా ఒక సంవత్సరం పొడిగించవచ్చు
3) విధాన సభ సభ్యుల సంఖ్య రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది
4) విధాన సభకు గవర్నర్ 1/6వ వంతు సభ్యులను నామినేట్ చేస్తారు - విధాన సభకు సంబంధించి కింది వాటిలో సరికానిది గుర్తించండి?
1) విధాన సభలో కనీస ఎమ్మెల్యేల సంఖ్య- 60
2) విధాన సభలో గరిష్ట ఎమ్మెల్యేల సంఖ్య- 500
3) ఎక్కువ ఎమ్మెల్యేలు గల రాష్ట్రం- ఉత్తరప్రదేశ్ (403)
4) తక్కువ ఎమ్మెల్యేలు గల రాష్ట్రం- గోవా (40) - ఆంధ్రప్రదేశ్ విధాన సభకు సంబంధించి సరికానిది గుర్తించండి?
1) ఆంధ్రప్రదేశ్ విధాన సభలో గల ఎమ్మెల్యేలు- 175
2) ఆంధ్రప్రదేశ్ విధాన సభలో బీసీ వర్గాలకు నిర్దేశించిన స్థానాలు- 32
3) ఆంధ్రప్రదేశ్ విధాన సభలో ఎస్సీ వర్గాలకు నిర్దేశించిన స్థానాలు- 29
4) ఆంధ్రప్రదేశ్ విధాన సభలో ఎస్టీ వర్గాలకు నిర్దేశించిన స్థానాలు- 7
Answers
1-3, 2-1, 3-3, 4-2, 5-1, 6-4, 7-2, 8-4, 9-1, 10-2, 11-2, 12-4, 13-3, 14-1, 15-3, 16-4, 17-1, 18-3, 19-3, 20-4, 21-4, 22-2, 23-4, 24-3, 25-4, 26-1, 27-2, 28-4, 29-2, 30-4, 31-4, 32-4, 33-2
దేవేందర్
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

