కేజీబీవీల్లో 937 కొత్త పోస్టులు..
new post sanctioned to kgbv | నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)ల్లో టీచర్ల కొరత సమస్యను

హైదరాబాద్ : నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)ల్లో టీచర్ల కొరత సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం 937 పోస్టులను మంజూరుచేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్, అండ్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ మంగళవారం జీవో 1321ని జారీచేశారు. వీరిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకునేందుకు అనుమతినిచ్చారు. వీరిని నియమించేందుకు విద్యాశాఖ అధికారులు త్వరలోనే రిక్రూట్మెంట్ టెస్ట్‌ను నిర్వహించాలని భావిస్తున్నారు. పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన వీటిని భర్తీచేయనున్నారు.
మరో 4,386 మంది కొనసాగింపు..
కేజీబీవీ పోస్టులతో పాటు, పాఠశాల విద్యాశాఖ పరిధిలో 4,386 ఉద్యోగులను కొనసాగించేందుకు సైతం అనుమతినిచ్చారు. తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న 397 వోకేషనల్ ట్రైనీస్ అండ్ వోకేషనల్ కో ఆర్డినేటర్లు, 1,435 అవర్లీ బేస్డ్ టీచర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రభుత్వ, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న 2,343 పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్లు, ప్రభుత్వ బీఈడీ కాలేజీలు, డైట్‌కాలేజీల్లో 211 గెస్ట్ ఫ్యాకల్టీని కొనసాగించేందుకు అనుమతినిచ్చారు. వీరిని 2022 ఏప్రిల్ 30 వరకు కొనసాగించేందుకు జీవో ద్వారా అనుమతినిచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

