నాని హీరోగా నటిస్తున్న సినిమా ‘అంటే సుందరానికీ..’ నజ్రియా ఫహాద్ నాయికగా నటిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ…‘టీజర్‌కు రెట్టింపు వినోదం ట్రైలర్లో చూస్తారు. అంతకు పదింతలు సినిమా హాస్యభరితంగా ఉంటుంది. సినిమా హిట్ ఒట్టేసి చెబుతున్నా. ఎందుకనేది రేపు థియేటర్లో చూసినప్పుడు తెలుస్తుంది. మంచి టీమ్ పనిచేసింది. తెలుగులో చాలా మంది ప్రయత్నించినా నటించని నజ్రియా మా సినిమా ఒప్పుకున్నందుకు థాంక్స్. ఈ సినిమా చేసిన తర్వాత దర్శకుడు వివేక్ ఆత్రేయ చిత్రాలను తొలి రోజు చూసేయాలని నిర్ణయించుకున్నాను. అతను చెప్పినట్లు ఈ కథను ఎవరూ చెప్పలేరు. అతను చేసే సినిమాలు మరో దర్శకుడు చేయలేరు. సినిమా మీకు తప్పకుండా నచ్చుతుందని చెప్పగలను’ అన్నారు. ‘నాని, నజ్రియా నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంటను మీరు బాగా ఇష్టపడతారు. స్క్రిప్ట్ రాసినప్పుడు దీన్ని ఇలాగే తెరకెక్కిస్తే బాగుంటుంది అనుకున్నాను కానీ నా టీమ్ అంతకు పదింతలు ఔట్పుట్ ఇచ్చారు’ అన్నారు దర్శకుడు వివేక్ ఆత్రేయ.