Damarukam | 14 ఏళ్ల నాగార్జున రికార్డుకు ఎసరు.. ‘ఢమరుకం’కి చేరువలో తరుణ్ భాస్కర్, దుల్కర్ సినిమాలు!
Damarukam | టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక ఆసక్తికరమైన రికార్డు వేట కొనసాగుతోంది. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘ఢమరుకం’ సినిమా నవంబర్ నెలలో నెలకొల్పిన అత్యధిక వసూళ్ల రికార్డుకు 14 ఏళ్ల తర్వాత గట్టి పోటీ ఎదురవుతోంది.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక ఆసక్తికరమైన రికార్డు వేట కొనసాగుతోంది. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘ఢమరుకం’ సినిమా నవంబర్ నెలలో నెలకొల్పిన అత్యధిక వసూళ్ల రికార్డుకు 14 ఏళ్ల తర్వాత గట్టి పోటీ ఎదురవుతోంది. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో, అనుష్క కథానాయికగా 2012 నవంబర్ 23న విడుదలైన ‘ఢమరుకం’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 48 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, నవంబర్ నెలలో విడుదలైన తెలుగు చిత్రాల్లో ఆల్‌టైమ్ రికార్డును సృష్టించింది. అయితే దశాబ్ద కాలానికి పైగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును ఇప్పుడు రెండు కొత్త తెలుగు సినిమాలు అధిగమించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కి, నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE Repeat) బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం విడుదలైన ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 45 కోట్ల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ‘ఢమరుకం’ రికార్డును బద్దలు కొట్టడానికి ఈ సినిమాకు మరో రూ. 3 కోట్ల వసూళ్లు మాత్రమే అవసరం కావడంతో, ఈ వారంలోనే ఆ మైలురాయిని దాటడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు, దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం కూడా నవంబర్ 20న విడుదలై బాక్సాఫీస్ వద్ద తన జోరును ప్రదర్శిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే సుమారు రూ. 37 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, ఈ వీకెండ్లో వచ్చే వసూళ్లతో రూ. 48 కోట్ల మార్క్‌ను అందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేవలం ఒక్క రోజు వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాల్లో ఏది ముందుగా నాగార్జున రికార్డును అధిగమిస్తుందోనని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Damarukam | 14 ఏళ్ల నాగార్జున రికార్డుకు ఎసరు.. ‘ఢమరుకం’కి చేరువలో తరుణ్ భాస్కర్, దుల్కర్ సినిమాలు!
Cholesterol | కొలెస్ట్రాల్ సాధారణంగానే ఉన్నా గుండెకు ప్రమాదం తప్పదా? ఈ పరీక్షలు కీలకం!
BRS Complaint | బీఆర్ఎస్ నాయకుడిపై దాడి..కేసులు నమోదు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు
Allu Arjun | సినిమాల విషయంలో రూటు మార్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇకపై వరుస సినిమాలతో బిజీ బిజీ!
India-US trade deal | భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం.. కీలక అంశాలు..!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

