Naga Chaitanya | నాగ చైతన్య పోస్ట్.. అర్జంట్‌గా షోయు నుంచి ఏమైనా ఆర్డర్ చేసుకోవాలన్న మౌళి
Naga Chaitanya | ఎలాంటి హడావిడి లేకుండా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రం 'లిటిల్ హార్ట్స్ .ఈ మూవీ ఎవరూ ఊహించని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. తొలి రోజునే బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసిన ఈ చిత్రం వీక్ డేస్‌లో కూడా విపరీతంగా కలెక్షన్స్ రాబడుతుంది.
Naga Chaitanya | ఎలాంటి హడావిడి లేకుండా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్ .ఈ మూవీ ఎవరూ ఊహించని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. తొలి రోజునే బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసిన ఈ చిత్రం వీక్ డేస్‌లో కూడా విపరీతంగా కలెక్షన్స్ రాబడుతుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంకి సినీ ప్రియులతో పాటు సెలబ్రిటీలని సైతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. “లిటిల్ హార్ట్స్ అద్భుతమైన సినిమా. రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందిన ఈ చిత్రం చాలా బాగుంది. నటీనటుల పెర్ఫార్మెన్స్, డైరెక్షన్, మేకింగ్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. థియేటర్‌కి వెళ్లి తప్పకుండా చూడండి!” అని రాసుకొచ్చారు
ఈ పోస్ట్‌కు చిత్ర బృందం స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేసింది. హీరో మౌళి తనూజ్.. “థ్యాంక్స్ అన్నా… మీలాంటి స్టార్ నుంచి మా సినిమాపై ట్వీట్ రావడం గర్వంగా ఉంది. ఇప్పుడు ఈ ఆనందం సెలబ్రేట్ చేసుకోవడానికి మీ ‘షోయు’ (నాగ చైతన్య రెస్టారెంట్) నుంచి ఏదైనా ఆర్డర్ చేసుకోవాలి!” అని సరదాగా రిప్లై ఇచ్చారు. ఇక దర్శకుడు సాయి మార్తాండ్ కూడా చైతన్యకు ధన్యవాదాలు చెబుతూ, “మీకు సినిమా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మళ్లీ మిమ్మల్ని రొమాంటిక్ కామెడీలో చూడాలని ఎదురుచూస్తున్నాం” అంటూ స్పందించారు. అక్కినేని సుమంత్ కూడా ‘లిటిల్ హార్ట్స్’పై ప్రశంసలు కురిపించారు.చాలా సరదాగా ఉంది. థియేటర్లో ఫుల్‌గా నవ్వుకున్నా. బ్లాక్‌బస్టర్ హిట్‌కు అభినందనలు! అంటూ ట్వీట్ చేశారు.
వీరితో పాటు, రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, అల్లరి నరేష్, రాహుల్ రవీంద్రన్, అభిషేక్ జీవింత్ (టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్), వశిష్ఠ (విశ్వంభర డైరెక్టర్) వంటి పలువురు సెలబ్రిటీలు ఈ సినిమాను చూసి అభినందనలు తెలిపారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని, బీవీ వర్క్స్ (బన్నీ వాస్) మరియు వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు థియేట్రికల్‌గా విడుదల చేశాయి. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఎస్ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించారు. ‘లిటిల్ హార్ట్స్’ అంచనాలేమీ లేకుండా రిలీజ్ అయినా, మంచి కంటెంట్ తో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

