ప్రయాణాన్ని ఆస్వాదిస్తా

‘అవకాశాలతో సంబంధం లేకుండా పూరి జగన్నాథ్‌తో కలిసి ప్రయాణం చేయడాన్ని నేను ఇష్టపడతాను. నా సినిమాలకు సంబంధించి ఫలితం ఏదైనా నిర్మొహమాటంగా ఆయన చెబుతుంటారు’ అని అన్నారు సంగీతదర్శకుడు సునీల్ కశ్యప్. ఆయన స్వరకర్తగా పనిచేసిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఆకాష్‌పూరి, కేతిక శర్మ జంటగా నటించారు. అనిల్ పాదూరి దర్శకుడు. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించారు. ఈ నెల 29న విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్‌లో సంగీత దర్శకుడు సునీల్‌కశ్యప్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ప్రేమ, ఆకర్షణకు మధ్య ఉన్న అంతరాన్ని చాటుతూ తెరకెక్కిన రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది. బాణీలు, నేపథ్యసంగీత పరంగా వైవిధ్యతను కనబరిచే అవకాశం నాకు దొరికింది. సినిమా కోసం నేను స్వరపరచిన ‘పీనే కే బాద్’ పాట పూరి జగన్నాథ్‌కు చాలా నచ్చింది. ఆయనతో పాటు ఈ పాట బాగుందని చాలా మంది అభినందిస్తున్నారు. ఈ సినిమాలో ఆకాష్, కేతికశర్మ ఇద్దరితో పాటలను పాడించాను. నటుడిగా ఆకాష్‌ను మరో మెట్టు ఎక్కించే చిత్రమిది. సంగీతపరంగా చిన్న సినిమా, పెద్ద సినిమా అనే భేదాలు నాకు లేవు. హిైట్టెన ప్రతీదీ నా దృష్టిలో పెద్ద సినిమాగానే భావిస్తాను. నన్ను సంగీతదర్శకుడిగా తీసుకోకపోయినా పూరి జగన్నాథ్ ప్రతి సినిమాకు నేను పనిచేస్తా. ఆయనతో కలిసి సాగించే ప్రయాణాన్ని నేను ఆస్వాదిస్తా. కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు లేవనే అసంతృప్తి లేదు. ఏం జరిగినా నా మంచికే అనుకుంటా. సానుకూల దృక్పథంతో ముందడుగువేస్తా. భవిష్యత్తులో సినిమాలకు సంగీతాన్ని అందించడంతో పాటు క్లాసికల్ మ్యూజిక్ ఆల్బమ్స్‌ను చేయాలనుంది. ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ‘గాడ్సే’కు సంగీతాన్ని అందిస్తున్నా’ అని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

