రోబో సినిమా స్ఫూర్తితో.. 47 భాషలు మాట్లాడే ‘షాలు’

ముంబై: రజనీకాంత్ రోబో సినిమాను స్ఫూర్తిగా తీసుకున్న ముంబైలోని కేంద్రీయ విద్యాలయానికి చెందిన కంప్యూటర్ సైన్స్ టీచర్ దినేశ్ పటేల్, 47 భాషలు మాట్లాడే హ్యూమనాయిడ్ రోబోట్‌ను అభివృద్ధి చేశారు. దీనికి ‘షాలు’ అని పేరు పెట్టారు. ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, భోజ్‌పురి, బెంగాళీ, గుజరాతీ, తమిళ్, తెలుగు, మలయాళం ప్రాంతీయ భాషలతో పాటు 39 విదేశీ భాషల్లో ఇది అనర్గళంగా మాట్లాడుతుంది. మహిళా రూపంలో ఉన్న ఈ హ్యూమనాయిడ్ ఆడవారి గొంతుకతో మాట్లాడుతుంది. ‘షాలు’ అందరినీ పలుకరించడంతోపాటు భావోద్వేగాలను కూడా వ్యక్తం చేస్తుంది. వార్తా పత్రికలు చదువడం, పద్యాలు వినిపించడం వంటి ఇతర ఎన్నో పనులు కూడా చేస్తుంది.

హ్యూమనాయిడ్ రోబోట్ ‘షాలు’ మనుషులను గుర్తిస్తుందని, చెప్పిన అంశాలను జ్ఞాపకం ఉంచుకుంటుందని, జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్‌కు సంబంధించిన ప్రశ్నలకూ సమాధానం చెబుతుందని దినేశ్ పటేల్ తెలిపారు. స్కూళ్లలో టీచర్‌గా, కార్యాలయాల్లో రిసెప్షనిస్ట్‌గా, ఇతర ఇంటి పనుల కోసం దీని సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు. ప్లాస్టిక్, కార్డ్బోర్డ్, చెక్క, అల్యూమినియం వంటి వ్యర్థాలతో మూడేండ్లు శ్రమించి యాభై వేల వ్యయంతో దీనిని తయారు చేసినట్లు వివరించారు. ముఖానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడానని, మాస్క్‌తో మరింత అందంగా తీర్చిదిద్దవచ్చని చెప్పారు. హాంకాంగ్‌కు చెందిన హాన్సన్ రోబోటిక్స్ అభివృద్ధి చేసిన ‘సోఫియా’ రోబోతో ‘షాలు’ సమానమని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

