ముంబైలో భారీ అగ్ని ప్రమాదం..
ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. | ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోని ఓషివారా ప్రాంతంలోని ఓ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగి ప్రమాదం జరిగింది.

ముంబై : ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోని ఓషివారా ప్రాంతంలోని ఓ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగి ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి ఎనిమిది ఫైర్ ఇంజిన్లను తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. మరో ఎనిమిది వాటర్ ట్యాంకర్లను తరలించారు. అంబులెన్స్‌ను సైతం అందుబాటులో ఉంచగా.. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.
ఓషివారా రిలీఫ్ రోడ్‌లోని ఉన్న ఆషియానా టవర్లోని మొదటి ఫ్లోర్లో ఉదయం 7.57 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అగ్ని ప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో చుట్టు పక్కల ప్రాంతంలో భారీగా పొగ కమ్మేసింది. పక్కనున్న భవనాల వాసులు సైతం అప్రమత్తమై ఇండ్ల నుంచి బయటకు వచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

