అమెరికాలో కాల్పుల కలకలం
అమెరికాలో కాల్పుల కలకలం | అమెరికాలో మళ్లీ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. విస్కాన్సిస్లోని క్యాసినోలో శనివారం రాత్రి ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.

వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. విస్కాన్సిస్లోని క్యాసినోలో శనివారం రాత్రి ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఘటనలో ఏడుగురు గాయపడ్డారని సమాచారం. గ్రీన్ బే శివారులోని ఒనిడా క్యాసినోలో ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు నిమిషాల పాటు కాల్పులు జరిగి, ఆగిపోయాయని.. ఈశాన్యం వైపు నుంచి శబ్దాలు వచ్చాయని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అయితే, కాల్పుల ఘటనపై ఖచ్చితమైన సమాచారం లేదని.. గాయపడిన వారి గురించి సమాచారం లేదని గ్రీన్ బేలోని ఒనిడా క్యాసినో ప్రతినిధి బొబ్బి వెబ్స్టర్ అనే మహిళ ట్విట్టర్లో తెలిపారు. ‘వ్యక్తి ఎక్కడ కాల్పులు జరిపాడో సరిగ్గా తెలియదు, ఎంతమంది వ్యక్తులు చనిపోయారో కూడా తెలియదు’ అని పేర్కొన్నారు. 20 నుంచి 30 రౌండ్ల తుపాకీ కాల్పులు జరిగినట్లు వెస్ట్ఫాల్ అనే వ్యక్తి స్థానిక టీవీ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు క్యాసినోకి చేరుకున్నారు. ఘటనపై విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో పర్యటన
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

