Abbas Ansari | విద్వేష ప్రసంగం కేసులో ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీకి రెండేళ్ల జైలుశిక్ష
Abbas Ansari | అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా విద్వేషపూరిత ప్రసంగం చేసిన కేసులో సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) ఎమ్మెల్యే (MLA) అబ్బాస్ అన్సారీ (Abbas Ansari) కి ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం మావు జిల్లా (Mau district) లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది.
Abbas Ansari : అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా విద్వేషపూరిత ప్రసంగం చేసిన కేసులో సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) ఎమ్మెల్యే (MLA) అబ్బాస్ అన్సారీ (Abbas Ansari) కి ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం మావు జిల్లా (Mau district) లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఇదే కేసులో దోషిగా తేలిన అబ్బాస్ అన్సారీ సన్నిహితుడు మన్సూర్ అన్సారీకి కూడా కోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధించింది.
విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులలో ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ, అతడి సన్నిహితుడు మన్సూర్ అన్సారీలను ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ఇవాళ ఉదయం దోషులుగా తేల్చింది. అనంతరం అబ్బాస్ అన్సారీకి రెండేళ్ల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. మన్సూర్ అన్సారీకి ఆరు నెలల జైలుశిక్ష విధించింది.
కాగా ఉత్తరప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎస్బీఎస్పీ అభ్యర్థి అబ్బాస్ అన్సారీ, అతడి సన్నిహితుడు మన్సూర్ అన్సారీ విద్వేషపూరిత ప్రసంగం చేశారు. ఇవాళ ఈ కేసు విచారణ మావు జిల్లాలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో జరిగింది. అక్కడికి అబ్బాస్ అన్సారీతోపాటు అతడి సోదరుడు ఉమర్ అన్సారీ కూడా వచ్చారు.
Read More >>
బీఎస్ఎఫ్ మహిళా ఆఫీసర్ నేహా భండారిని సత్కరించిన ఆర్మీ చీఫ్
దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. రెండు వేలు దాటిన పాజిటివ్ కేసులు
తాజ్‌మహల్‌కు ప్రత్యేక రక్షణ.. యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

